బరువు పెరగకుండా ఉండడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. కొంత మంది ఎక్సర్ సైజులను ఆశ్రయిస్తే మరి కొంత మంది డైట్ లను ఫాలో అవుతారు. అయితే కొంత మంది మాత్రం తినకుండా కడుపును కూడా కాల్చుకుంటారు. కానీ కడుపు కాల్చుకుంటే ఆకలి చచ్చిపోతుంది తప్ప బరువు తగ్గరు. పైగా అనారోగ్యానికి కూడా గురవుతారు. కానీ ఒక్కోసారి బరువు పెరిగితే దాన్ని అదుపు చేయడం చాలా కష్టం అవుతుంది. అందుకే ఏం చేయాలో పాలుపోక ఇబ్బందులు పడతారు బరువు తగ్గడానికి. కానీ ఈ ఆహారాన్ని తింటే బరువు తగ్గుతారు. పైగా ఎంత తిన్నా బరువే పెరిగరు. మీ బరువు పెరగకుండా నిరోధించే తక్కువ కేలరీలు ఉన్న ఆహరం గురించి తెలుసుకుందాం.

పాపడ్‌
పాపడ్‌ ను భోజనంతో పాటు వడ్డిస్తారు. బరువు గురించి దిగులు ఉన్నవారికి పాపడ్‌లు మంచి ఆప్షన్. పాపడ్‌లో ఫైబర్, ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. మీకు ఆకలిగా ఉన్నప్పుడు తినండి. దీనితో బరువును సులభంగా నియంత్రించవచ్చు. అయితే వేయించి మాత్రం తినొద్దు. మీరు దీన్ని కూరగాయల సగ్గుబియ్యంతో కూడా తినవచ్చు.

ఓట్స్ ఇడ్లీ
ఓట్స్ మరియు తురిమిన క్యారెట్‌లతో చేసిన ఇడ్లీ చాలా ఆరోగ్యకరమైనది. అంతే కాకుండా చాలా తక్కువ కేలరీలు ఉండే అల్పాహారం. ఇది తింటే పొట్ట కూడా నిండుతుంది. బరువు పెరుగుతుందన్న చింత కూడా ఉండదు. దీన్ని స్నాక్‌గా తీసుకోవడమే కాకుండా లంచ్ లేదా డిన్నర్‌గా కూడా తీసుకోవచ్చు.

ధోక్లా
ధోక్లా కూడా చాలా తక్కువ కేలరీలు ఉండే ఆహరం లిస్ట్ లో ఉంటుంది. దీన్ని మైక్రోవేవ్‌లో చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. మీరు దీన్ని ఉదయం లేదా సాయంత్రం స్నాక్‌గా తినవచ్చు.

పేలాలు (బొరుగులు), కాల్చిన పప్పులు
మీరు తక్కువ కేలరీల స్నాక్‌ గా బొరుగులు లేదా పేలాలు, కాల్చిన పప్పులు కూడా తినవచ్చు. ఇది మీ పొట్ట సమస్యలను దూరం చేస్తుంది. శక్తిని ఇస్తుంది. అలాగే దీని వల్ల బరువు పెరిగే ప్రమాదం కూడా ఉండదు. మీకు ఆకలిగా అనిపించినప్పుడు మీరు ఏమాత్రం చింతించకుండా ఎంత కావాలంటే అంత తినొచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: