ఒకప్పటితో పోల్చి చూస్తే నేటి రోజుల్లో మనిషి జీవన శైలిలో ఎన్నో మార్పులు వచ్చాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. నేటి రోజుల్లో సమయం ప్రతి ఒక్కరికి ఎంతో విలువైనదిగా మారిపోయింది. దీంతో ఉరుకుల పరుగుల జీవితంలో మనిషి ఎంతో బిజీగా గడుపుతున్నాడు. ఇలాంటి సమయంలోనే ఆరోగ్యం గురించి పట్టించుకునే సమయం ఎవరికీ లేకుండా పోయింది అన్న విషయం తెలిసిందే. ఇక నేటి రోజుల్లో గంటల తరబడి ఒకేచోట కూర్చుని చేసే ఉద్యోగాలు అందరూ చేస్తున్నారు.. దీంతో పాటు మానసిక శ్రమ తప్ప శారీరక శ్రమ మాత్రం ఎక్కడ ఉండటం లేదు. అదే సమయంలో ఆహారపు అలవాట్లు కూడా ఎంతగానో మారిపోయాయి.



 వెరసి ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఒకే చోట కూర్చుని పని చేయడం కారణంగా ఎక్కువగా బరువు పెరిగిపోవడం సమస్య ఎంతో మందిని వేధిస్తోంది. తరచూ ఒకే చోట కూర్చోవడం వల్ల అటు తొడల్లో బాగా కొవ్వు పెరిగిపోయి ఎంతో మంది ఇబ్బందులు పడుతూ ఉంటారు అయితే ఇలా తొడల్లో ఎక్కువగా కొవ్వు పేరుకుపోతే నడవడానికి కూడా ఎంతో ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయ్. దీంతో తొడల్లో పేరుకుపోయిన కొవ్వును తొలగించడం ఎలా అని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు చాలా మంది.



 అయితే ఇలా తొడలలో కొవ్వు పేరుకుపోయి నడవడానికి ఇబ్బంది పడుతున్న వారు ఒకే ఒక్క వ్యాయామంతో తొడల లోని కొవ్వును కరిగించుకోవచ్చు అని చెబుతున్నారు నిపుణులు. స్క్వాట్స్ ఎక్సర్సైజ్ తొడలోని కొవ్వును కరిగించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది అని చెబుతున్నారు. అయితే స్క్వాట్స్ ఎక్సర్సైజ్  కేవలం తొడలోని  కొవ్వును కరిగించడమే కాదు జీర్ణ వ్యవస్థను కూడా ఎంతో మెరుగుపరుస్తుంది. ఇక మోకాలి కీళ్లు హెల్తీగా ఉండటానికి కూడా ఉపయోగపడుతుందట. శరీరంలోని హార్మోన్ల స్థాయి కూడా పెరిగేందుకు ఈ ఎక్సర్సైజ్ దోహద పడుతుందని నిపుణులు చెబుతున్నారు.అందుకే ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా  కనీసం 30 స్క్వాట్స్ చేయడం బెటర్ అంటూ సూచిస్తున్నారు నిపుణులు.

మరింత సమాచారం తెలుసుకోండి: