గ్రీన్ టీ ని ఎక్కువగా తాగితే జీర్ణక్రియ సమస్య ఏర్పడుతుంది. ఇక అంతే కాకుండా ఈ టీ నీఎక్కువగా తాగితే.. ఎసిడిటీ సమస్య కూడా పెరుగుతుంది. వీటి వల్ల మలబద్దకం సమస్యలు కూడా ఎక్కువగా వస్తాయి.
ప్రతిరోజూ రెండు లేదా మూడు కప్పుల గ్రీన్ టీ తాగినట్లయితే.. తల నొప్పి సమస్య దూరమవుతుంది . కానీ ఎక్కువ గ్రీన్టీని తాగినట్లయితే మైగ్రేన్ సమస్య కూడా పెరుగుతుంది.
గ్రీన్ టీ లో ఎక్కువగా కెఫిన్ ఉండక పోవడం వల్ల.. నిద్ర లేకపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి. వీటిని ఎక్కువగా తాగడం వల్ల మేలటోనిన్ హార్మోన్ పైన ఇది ప్రభావం చూపుతుంది.
గ్రీన్ టీ ని ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో ఐరన్ కు ఆటంకం కలుగుతుంది. ప్రతి రోజు ఎక్కువగా గ్రీన్ టీ తాగితే రక్తం తగ్గుతుంది.
గ్రీన్ టీ లో ఎక్కువగా టానిక్ ఉంటుంది ఇది ప్రేగులలో ప్రోటీన్ మొత్తాన్ని పూర్తిగా తగ్గిస్తుంది. దీంతో వాంతులు , వికారం వంటి సమస్యలు ఎదురవుతాయి.
గ్రీన్ టీని ఎక్కువగా తీసుకుంటే ఎముకలు బలహీనపడతాయి. దీంతో బోలు ఎముకల వ్యాధి వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
గ్రీన్ టీ ని ఎక్కువగా తాగినట్లయితే రక్తపోటు సమస్య కూడా వస్తుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి