పురాణాల ప్రకారం కనీసం రోజుకు ఎనిమిది గంటల పాటు రాగి పాత్రలో నిల్వ ఉంచిన నీటిని తాగడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి అని అందరికీ తెలిసిన విషయమే. ఇక నీరు నిల్వ ఉంచడానికి రాగి బిందెలు, కుండలు , గాజు పాత్రలు కూడా ఉపయోగిస్తారు .కానీ కొంతమంది రాగిపాత్రలో ఆహారాన్ని తినడానికి చాలా ఇష్టపడుతున్నారు. ఎందుకంటే రాగి పాత్రలో నిల్వ ఉంచిన ఆహారాలు తినడం వల్ల ఆరోగ్యానికి ప్రయోజనకరం అని భావించడం గమనార్హం. ఇకపోతే రాగి పాత్రలో కొన్ని పదార్థాలు తినడం, తాగడం కూడా ఆరోగ్యానికి హానికరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు.


నిజానికి రాగి పాత్రలలో  నిమ్మరసం తో తయారు చేసిన ఏదైనా వంటకాలను నిల్వ ఉంచి.. తినడం వల్ల అది ఆరోగ్యానికి అత్యంత హానికరం అట. ఎందుకంటే నిమ్మకాయలో ఉండే యాసిడ్.. రాగితో కలిస్తే విషంగా మారిపోతుంది.


పెరుగు అలాగే పెరుగు తో తయారు చేసిన ఆహార పదార్థాలను రాగి పాత్రలో ఉంచి తినకూడదు. ఫలితంగా ఫుడ్ పాయిజనింగ్ అవ్వడం, వికారంగా అనిపించడం , నరాల బలహీనత ఇలాంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.


రాగి పాత్రలలో  వెనిగర్ వాడడం కూడా తగ్గించాలి. ఎందుకంటే వెనిగర్ ఒక రకమైన ఆమ్ల పదార్ధం.. కాబట్టి రాగిపాత్రలో నిల్వ ఉంచి తినడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి.

ఇక ఇవేకాదు కూరగాయలను కూడా మనం రాగి పాత్రలలో ఉంచడం లేదా అందులో ఉంచి తినడం వల్ల అత్యంత ప్రమాదకరం అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇందులో కూడా ఉప్పు , పులుపు  అధికంగా ఉంటుంది కాబట్టి వీటిని రాగి పాత్రలో నిల్వ ఉంచితే అవి విషం లా  మారిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు రాగి పాత్రలో కేవలం నీటిని మాత్రమే నిల్వ ఉంచి  తాగడానికి ప్రయత్నం చేయాలి తప్ప..  ఇలాంటి ఆహార పదార్థాలను రాగి పాత్రలో ఎట్టి పరిస్థితుల్లో కూడా నిల్వ ఉంచవద్దు.

మరింత సమాచారం తెలుసుకోండి: