ప్రతిరోజు ఉదయం పూట మనం తీసుకొనే అల్పాహారం పైన మన రోజు ఆధారపడి ఉంటుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. రోజంతా చాలా చురుకుగా ఉండాలి అంటే అందుకు తగ్గట్టుగా ఆరోగ్యకరమైన ఆహారాన్ని కూడా తీసుకోవాల్సి ఉంటుంది.సాధారణంగా వేసవికాలంలో శరీరంలో శక్తి తగ్గిపోయి చాలా త్వరగా అలసిపోతూ ఉంటాము. కాబట్టి వేడిని తగ్గించి శరీరాన్ని శక్తివంతంగా ఉంచడానికి ఉపయోగపడే ఆహార పదార్థాలను మన అల్పాహారంలో తీసుకోవాలి. ఇకపోతే ఉదయం పూట లేవగానే ఖాళీ కడుపుతో తినాల్సిన కొన్ని ఆహారపదార్థాలు ఏమిటో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.ఇక రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు నీటిలో జీలకర్ర వేసి రాత్రంతా కూడా బాగా నానబెట్టాలి. ఇక ఆ నీటిని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగడం వల్ల శరీరంలోని విషపదార్థాలు అన్నీ కూడా బయటకు పంపి వేయబడతాయి. ఇక జీవక్రియ రేటు కూడా చాలా బాగా వృద్ధిచెందుతుంది. ఇంకా బరువు తగ్గడానికి బాగా సహాయపడుతుంది.అలాగే ప్రతి రోజు ఉదయాన్నే నిద్ర లేవగానే బొప్పాయిని తినాలి అని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.


ఇంకా బొప్పాయిలో ఉండే పీచు పదార్థాలు జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడానికి చాలా బాగా సహాయపడతాయి. ముఖ్యంగా శరీరంలోని చెడు కొవ్వును ఈజీగా బయటకు తొలగించబడుతుంది. అంతేకాదు బొప్పాయిలో ఉండే అన్ని పోషకాలు కూడా మన శరీరానికి బాగా లభిస్తాయి.ఇంకా జ్ఞాపకశక్తి పెరిగి, మన మనస్సు కూడా నిశ్చలంగా ఉండాలి అంటే కచ్చితంగా నీటిలో నానబెట్టిన బాదం పప్పు లేదా మరే ఇతర డ్రై ఫ్రూట్స్ ను తీసుకోవాలని వైద్యులు బాగా సలహా ఇస్తున్నారు. ముఖ్యంగా జిమ్ కి వెళ్లే వారు ఇంకా అలాగే శరీరం ఫిట్ గా ఉండాలని చేసుకునేవారు కూడా బాదంపప్పు, వాల్నట్స్ ఇంకా ఎండిన అత్తిపండ్లను నీటిలో నానబెట్టి ఉదయాన్నే తాగడం వల్ల శరీరానికి కావాల్సిన అన్ని పోషకాలు లభించడమే కాకుండా చాలా ఆరోగ్యంగా కూడా ఉండవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: