నిన్న మొన్నటి వరకు వేసవి కాలం అదిరిపోయే ఎండలతో అందరినీ ఎంతగానో ఇబ్బంది పెట్టింది. ముఖ్యంగా దీని వలన పసిపిల్లలు మరియు వృద్దులు బాగా బాధపడ్డారు. అయితే ఇప్పుడు వేసవి కాలానికి కాలం చెల్లిపోయింది. తాజాగా వర్షాకాలం మొదలు కానుంది. ప్రస్తుతం వాతావరణం శరీరానికి చల్లగా, మనసుకు ఎంతో ప్రశాంతతను ఇస్తోంది. ఇక ఇప్పటికే తెలుగు రాష్ట్రాలలో రానున్న రెండు మూడు రోజుల్లో వర్షాలు పడబోతున్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది. దీనితో ఇక రానున్న నాలుగు అయిదు నెలలు వర్షాలు అధికంగా కురవనున్నాయి. అయితే ఈ వర్షాల వలన చల్లగా ఉండడం సంగతి అటుంచితే, అధికంగా వర్షాలు పడడం వలన మన ఆరోగ్యం కూడా దెబ్బ తినే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఇక 5 రోజుల పాటు నైరుతి రుతుపవనాల కారణంగా భారీ వర్షాలు కురుస్తాయని తెలుస్తోంది. దీనితో ప్రభుత్వం కూడా అప్రమత్తం అయ్యి లోతట్టు ప్రాంతాలలో ఉన్న ప్రజలను మార్చాలని ఇప్పటికే సంబంధిత అధికారులకు ఆదేశాలు అందినట్లు సమాచారం. అయితే ఈ వర్షాల కారణంగా ఆరోగ్యం ఆపదవుతుందని తెలిసిందే. ఇందుకోసం కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే ఎటువంటి రోగం మనల్ని దరి చేరకుండా ఉంటుందని కొందరు ఆరోగ్యనిపుణులు సలాహాలు ఇస్తున్నారు.

* వర్షాకాలం లో ఎక్కువగా వర్షాలు పడడం సహజమే.. అంతా మాత్రాన మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎక్కువగా వర్షంలో తడవకుండా ఉండడం వలన చాలా వరకు మీరు కొన్ని రకాల వ్యాధుల నుడ్ని బయట పడవచ్చు.

* ఇక సహజంగానే వర్షాకాలం అనగానే జలుబు, దగ్గు చిన్న పాటి జ్వరం వస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడు ప్రతి రోజూ ఎక్కువ సార్లు బాగా కాచి వడపోసిన నీటిని తాగుతూ ఉండాలి. ఎటువంటి పరిస్థితులలో మంచి నీటిని డైరెక్ట్ గా తీసుకోవడం మంచిది కాదు.

* ఎక్కువగా జ్వరం, జలుబు, విరేచనాలు ఈ కలుషితమైన నీటి ద్వారానే వ్యాప్తి చెందుతాయి.

* జ్వరం వచ్చి రెండు రోజుల వరకు తగ్గకుండా ఉంటే వెంటనే డాక్టర్ ను సంప్రదించండి.

* ఆహారపు అలవాట్లను కూడా కొంచెం మార్చుకోండి... వేడి పదార్ధాలను ఎక్కువగా తీసుకోండి.

* ముఖ్యంగా వర్షాకాలంలో కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ తీసుకోవడం చాలా ప్రమాదం.

మరింత సమాచారం తెలుసుకోండి: