మాములుగా మనకు మూడు రకాల సీజన్ లతో వాతావరణం మారుతూ ఉంటుంది. వాటిలో శీతాకాలం, ఎండాకాలం మరియు వానాకాలం లుగా విభజించారు. వాటిలో ఇప్పటికే మనము శీతాకాలం మరియు ఎండాకాలం లను పూర్తి చేసుకున్నాము. కాగా ఇప్పుడు వర్షాకాలం లోకి అడుగు పెట్టాము. అయితే ఈ కాలం వచినదంటే చాలు ఎక్కడ బట్టినా జలుబు, దగ్గు, జ్వరం లాంటి సాధారణ వ్యాధులు రావడం చూస్తూ ఉంటాము. ముఖ్యంగా చిన్న పిల్లల్లో మరియు పెద్దలలోనూ ఇలాంటివి ఈ సీజన్ ముగిసే వరకూ తరచూ వస్తూనే ఉంటాయి. అయితే ఇలాంటి వాటిని దూరం చేసుకోవాలి అంటే.. కొన్ని రకాల ఇంటి చిట్కాలను పాటిస్తే వీటి నుండి తట్టుకోవచ్చని తెలుస్తోంది. మరి ఈ చిట్కాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.

గోరువెచ్చని నీరు: ముఖ్యంగా ఈ వర్షాకాలంలో గోరు వెచ్చని నీటిని తీసుకుంటూ ఉండాలి. దీని వలన మన శరీరం అనారోగ్యం పలు కాకుండా ఉంటుంది. ఇంకా మన జీర్ణ వ్యవస్థ తీరు కూడా సరిగా ఉంటుంది.

పసుపు: మనము విరివిగా వాడే పసుపు లో యాన్తి బాక్టీరియా లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఈ పసుపును కనుక గోరు వెచ్చని నీటిలో కొంచెం మిరియాల పొడి వేసుకుని తాగితే ఎటువంటి ఆరోగ్య సమస్యలు మన దరి చేరకుండా చూసుకుంటుంది.

వెల్లుల్లి: వంటలో మనము ఉపయోగించే వెల్లుల్లి లో వేడిని కలిగించే గుణం ఉంటుంది. అందుకే దీనిని మనము ప్రతి కూరలోనూ ఖచ్చితంగా ఉపయోగిస్తూ ఉంటాము. దీని వలన బాక్టీరియా ఇన్ఫెక్షన్ ల నుండి తప్పించుకోవచ్చు.

జీలకర్ర: ఎక్కువగా మనము రసం మరియు తాలింపులలో జీలకర్రను వాడుతూ ఉంటాము. ఈ జీలకర్రలో పొటాషియం, ఐరన్, విటమిన్ సి, ఈ మరియు కే లు ఉంటాయి. వీటి వలన శరీరం నీరస పడకుండా చూసుకోవడంతో పాటు మన సర్రేరంలో ఉండే కొవ్వును కూడా కరిగిస్తుంది.

బొప్పాయి: ఇందులో సమృద్ధిగా యాన్తి యాక్సిడెంట్ లు మరియు పీచు పదార్ధం ఉంటాయి. ఇది మాన్ పొట్టలో ఉండే ప్రేగులను శుభ్రపరుస్తుంది. ఇది వర్షాకాలంలో జ్వరాలను దూరం చేయడానికి ఉపయోగపడుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: