ఇక ఈ మధ్యకాలంలో అందరికి కూడా ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ పెరిగిందనే చెప్పాలి. మంచి పోషకాలున్న ఆహారాన్ని తీసుకోవడానికి చాలా మంది ప్రయత్నం చేస్తున్నారు.ఇక అలాంటి ఆహారాలలో ఖచ్చితంగా Dill Seeds ఒకటి. వీటిలో ఎన్నో పోషకాలు ఇంకా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ గింజలలో క్యాల్షియం, ఐరన్, ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది.చాలా తక్కువ ఖర్చులో మన శరీరానికి కావాల్సిన ఎక్కువ పోషకాలను అందిస్తుంది. ఈ గింజలను వేగించుకుని పొడి చేసుకుని కూరలు ఇంకా అలాగే చట్నీలు వంటి వాటిలో జల్లుకోవచ్చు. లేదంటే ఖర్జూరం వంటి వాటితో కూడా కలిపి లడ్డూలు చేసుకొని వాటిని తినవచ్చు. అలాగే ఇవి కమ్మటి వాసన ఇంకా అలాగే మంచి రుచిని కూడా కలిగి ఉంటాయి. అలాగే ఇవి నువ్వుల కంటే కూడా ఎక్కువ కాల్షియం కలిగి ఉంటాయి. ఇందులో సూక్ష్మపోషకాలు కూడా చాలా సమృద్దిగా ఉంటాయి.ఈ Dill seeds ధర విషయానికి వస్తే కేజీ 250 రూపాయిల వరకు ఉంటుంది. ఇక 100 గ్రాముల గింజలలో 305 కేలరీల శక్తి,16 గ్రాముల ప్రోటీన్ ఇంకా 14.5 గ్రాముల కొవ్వు ఇంకా అలాగే 55 గ్రాముల కార్బోహైడ్రేట్లు ఇంకా 21 గ్రాముల ఫైబర్, 21 mg విటమిన్ సి, 16 mg ఇనుము, 20 mg సోడియం,5 mg జింక్ ఇంకా 12 మైక్రోగ్రాముల సెలీనియం, 1520 మి.గ్రా కాల్షియం ఉంటాయి.జింక్ ఇంకా సెలీనియం యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి.


ఈ మధ్య కాలంలో మనలో చాలా మంది ఐరన్, కాల్షియం ఇంకా ఫైబర్ లోపంతో బాధపడుతున్నారు.ఈ మూడు పోషకాలు Dill seeds లో చాలా పుష్కలంగా ఉంటాయి. అలాగే ఇందులో క్యాల్షియం ఎక్కువగా ఉండటంతో ఎదిగే పిల్లలకు ఉపయోగపడుతుంది. శరీరం కాల్షియం శోషించడానికి విటమిన్ సి చాలా ముఖ్యం. ఇందులో విటమిన్ సి కూడా చాలా సమృద్దిగా ఉంటుంది.ఇంకా అలాగే విటమిన్ కె కూడా ఉన్నందు వలన, ఎముకలు కాల్షియంను బాగా శోషించుకుంటాయి. కీళ్ల నొప్పులు ఇంకా మోకాళ్ళ నొప్పులను కూడా తగ్గిస్తుంది.ఇందులో ఐరన్ సమృద్దిగా ఉండుట వలన రక్తంలో హీమోగ్లోబిన్ శాతాన్ని బాగా పెంచి రక్తహీనత సమస్యను తగ్గిస్తుంది. ఇంకా అలాగే ఫైబర్ జీర్ణ సంబంద సమస్యలు లేకుండా చేస్తుంది.ఇక ముఖ్యంగా మలబద్దకం సమస్యను నివారించటంలో కూడా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: