శరీరంలో అధికంగా పేరుకుపోయిన కొవ్వును సైతం కరిగించడానికి పలు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇక అంతే కాకుండా ఆహారపు అలవాట్లలో విధానాలలో పలు మార్పులను కూడా చేస్తూ ఉంటాము అయితే ఆహారాన్ని నిల్వ చేసేటప్పుడు ప్లాస్టిక్ పైన మనం ఎక్కువగా శ్రద్ధ పెట్టాలని నిపుణులు తెలియజేస్తున్నారు. అయితే తాజాగా ఒకసారి కొత్త అధ్యయనంలో పరిశోధనలు చేయడం జరిగింది. అందులో పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.


మనం ప్యాకెట్ పాలు, పెరుగు, డ్రింక్ బాటిల్స్ వంటివే కాక.. కిచెన్ కు సంబంధించి ఉత్పత్తులలో కనిపించే ప్లాస్టిక్ వల్ల మనం బరువు పెరుగుతామని కొంతమంది పరిశోధకులు తెలియజేస్తున్నారు. ఉబకాయం అనేది ప్రపంచవ్యాప్తంగా ఎందరినో చాలా ఇబ్బంది పెడుతోంది. గడచిన 30 సంవత్సరాల లోపు 30.5 నుంచి 42.5 శాతానికి పెరిగినట్లుగా పరిశోధకులు తెలియజేశారు. దూలకాయమనేది ఆహారపు అలవాట్లలో మందులు వాడకం వల్ల ఇతర కారణాల చేత వస్తుందట. ఒకప్పుడు ప్లాస్టిక్ ఉన్న రసాయనక పదార్థాలు చాలా తక్కువగా ఉండేవని భావించేవారు అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ప్లాస్టిక్ ఉత్పత్తులు ఎక్కువగా ఉండటం వల్ల వీటిలో రసాయనాలు కూడా ఎక్కువగా కలుపుతున్నట్లుగా పరిశోధన లు తెలియజేశారు పరిశోధకులు. అందువల్ల అవి మన శరీరానికి చాలా ప్రమాదాన్ని కలిగిస్తున్నాయని తెలుపుతున్నారు.

బిస్ఫినాల్స్ మరియు థాలేట్‌లు.. ఇవి జీవ క్రియకు అంతరాయం కలిగించే పలు రసాయనాలలో ఒకటి అయితే ఇది ప్లాస్టిక్ ఉత్పత్తులలో ఎక్కువగా ఉపయోగించబడుతున్నాయి. ఒక వ్యక్తి పుట్టినప్పటినుంచి మరణించే వరకు ఆ శరీరంలో అన్ని జీవక్రియలు నియంత్రించే హార్మోన్లను ఉత్పత్తి చేస్తూ ఉంటాయి. పెరుగు కంటైనర్లు ఫ్రీజర్ బ్యాగులు ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ షాంపూ బాటిల్స్ ఇతర ప్లాస్టిక్ వాటిలలో కూడా ఎక్కువగా రసాయనాలు అంటున్నాయట. ఇలాంటి ప్లాస్టిక్ ఉత్పత్తులలో 55,000 కంటే ఎక్కువగా రసాయనిక భాగాలను గుర్తించినట్లుగా పరిశోధకులు తెలియజేశారు. ప్లాస్టిక్ రసాయనాలు ఎక్కువగా కొవ్వు కణాల అభివృద్ధికి సహాయపడుతున్నట్లుగా పరిశోధకులు తెలియజేయడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: