
ఇవి రోగనిరోధక శక్తిని పెంచి శరీరంలోని కొలెస్ట్రాల్ ను తగ్గించి గుండె జబ్బుల ప్రమాదాన్ని నిరోధిస్తాయి. శరీరాన్ని మధుమేహం నుండి రక్షించడంలో గుమ్మడి గింజలు చాలా చక్కగా పనిచేస్తాయి. రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి. అలాగే మగవారిలో స్పెర్మ్ నాణ్యతను పెంచి సంతాన భాగ్యం కలిగిస్తాయి. గుమ్మడికాయ గింజలు గుండె జబ్బులు , కొన్ని రకాల క్యాన్సర్ల నుండి కూడా రక్షిస్తాయి అంతేకాదు ఇందులో తగినంత పోషకాలు ఉండడం వల్ల చిన్నపాటి రోగాలు దరిచేరకుండా ఉంటాయి. గుమ్మడికాయ గింజలు మంచి ఫ్యాటీ యాసిడ్స్ , పొటాషియం , విటమిన్ బి2 కూడా ఉంటాయి. ఇలాంటి అరుదైన పోషకాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడే విటమిన్ ఈ ఇతర యాంటీ ఆక్సిడెంట్లు గుమ్మడి గింజల్లో లభిస్తాయి. అంతేకాదు గుమ్మడికాయ గింజలలో జింక్ , ఇనుముతో నిండిన పోషకాలు ఉండడం వల్ల రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తాయి. సూక్ష్మజీవుల నుండి శరీరాన్ని రక్షించే యాంటీ ఫంగల్ , యాంటీవైరల్ లక్షణాలను గుమ్మడి గింజలు కలిగి ఉంటాయి. ఇక ఈ మధ్యకాలంలో పెద్దవారికంటే యువకులలో కూడా గుండెపోటు చాలా సర్వసాధారణమైంది. కాబట్టి ఆరోగ్యం పై శ్రద్ధ వహిస్తే ఇలాంటి గుండె జబ్బులను దూరం చేసుకోవచ్చు. కాబట్టి ప్రతిరోజు మీ ఆహారంలో గుమ్మడికాయ గింజలను తీసుకోవడం అలవాటు చేసుకోవాలని చెబుతున్నారు నిపుణులు.