వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండేందుకు పాటించాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.వర్షాకాలంలో ఖచ్చితంగా తగినంత నీరు త్రాగాలి. తక్కువ ఉష్ణోగ్రతలు ఉన్నప్పటికీ శరీరానికి నీరు చాలా అవసరం. వర్షం వల్ల వచ్చే అధిక తేమ  డీహైడ్రేట్‌కు కారణం అవుతుంది. అందుకే ప్రతి రోజూ కనీసం ఎనిమిది గ్లాసుల నీళ్లు తాగడం ద్వారా హైడ్రేట్‌గా ఉండొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.ఈ వర్షాకాలంలో అల్లం, హెర్బల్ టీలు ఇంకా సూప్‌లు తాగాలి. ఎందుకంటే ఇవి శరీరాన్ని వెచ్చగా ఉంచుతాయి.ఇంకా అంతేకాకుండా శరీరంలో రోగనిరోధక శక్తిని కూడా పెంచుతాయి. గ్రీన్ టీ, చమోమిలే హెర్బల్ టీలలో యాంటీఆక్సిడెంట్లు చాలా పుష్కలంగా ఉంటాయి.ఇవి మీ రోగనిరోధక శక్తిని బాగా పెంచుతాయి.ఇంకా అలాగే సీజన్‌లో లభించే పండ్లను ఖచ్చితంగా తినాలి. యాపిల్స్, బేరి, దానిమ్మ ఇంకా నారింజ పళ్లలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. 


ఈ పండ్లు ఆరోగ్యకరమైన రోగనిరోధక వ్యవస్థని పెంచుతాయి. అలాగే ఇన్‌ఫెక్షన్లను కూడా నిరోధిస్తాయి.రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడానికి ఆహారంలో విటమిన్ సి ఉండే ఆహారాన్ని ఖచ్చితంగా తినాలి.నిమ్మకాయలు, నారింజ పండ్లు ఇంకా అలాగే ద్రాక్ష పండ్లలో విటమిన్ సి చాలా పుష్కలంగా ఉంటుంది. అలాగే బ్రకోలీ, బెల్ పెప్పర్స్, కివీస్‌లో కూడా విటమిన్ సి కూడా సమృద్ధిగా ఉంటుంది. ఇవి రోగనిరోధక శక్తిని బాగా పెంచుతాయి.ఇంకా వ్యాధుల నుంచి కాపాడుతాయి.అలాగే వర్షాకాలంలో తేలికపాటి, సమతుల ఆహారం ఖచ్చితంగా తీసుకోవాలి. లీన్ ప్రోటీన్స్, తృణధాన్యాలు కలిసి ఉండే భోజనాన్ని తప్పకుండా తినాలి. వోట్స్, క్వినోవా, బ్రౌన్ రైస్ వంటివి కూడా తినాలి. చికెన్, చేపలు, టోఫు వంటి లీన్ ప్రోటీన్స్ ద్వారా కండరాలు బాగా పెరుగుతాయి. కూరగాయలలో ఉండే ముఖ్యమైన విటమిన్లు, ఖనిజాలు ఇంకా యాంటీఆక్సిడెంట్లు ఆరోగ్యాన్ని బాగా మెరుగుపరుస్తాయి.ఈ వర్షాకాలంలో బయటి ఫుడ్స్ తినకుండా ఉండటం మేలు చేస్తుంది. వాతావరణ మార్పుల వల్ల బయటి ఫుడ్స్‌ మీ ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: