పచ్చి మిర్చిలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి.ఈ పచ్చిమిర్చి జీర్ణ శక్తిని పెంచడంలో ముఖ్య పాత్ర వహిస్తుంది. కానీ ఏదైనా కానీ దాన్ని మితంగా వాడితేనే అమృతం.. అంతకు మించి వాడితే ఖచ్చితంగా విషమన్న సంగతి తెలుసుకోవాలి. కాబట్టి పరిమితి ప్రకారం ఏది వాడినా కూడా అది ఆరోగ్యానికి మంచే తప్ప కీడు చేయదు. ఇక పచ్చి మిర్చితో ఎలాంటి శరీరానికి ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయో, ఎలా వాడాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.ఇక పచ్చి మిరపకాయలో ఉండే కొన్ని రకాల సమ్మేళనాలు నొప్పిని తగ్గించే లక్షణాలను కలిగి ఉంటాయి. వీటిని ఎక్కువగా నొప్పిని తగ్గించే క్రీములు ఇంకా ఆయింట్ మెంట్లలో ఉపయోగిస్తారు. ముఖ్యంగా ఆర్థరైటీస్, న్యూరోపతిలో నొప్పిని తగ్గించడంలో పచ్చి మిర్చి బాగా సహాయపడుతుంది.ఈ పచ్చి మిర్చిలో విటమిన్ సి, బీటా కెరోటిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఒత్తిడిని, ఆందోళనను ఎదుర్కొనడంలో సహాయం చేస్తాయి.


ఇంకా అలాగే దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని కూడా ఇవి చాలా ఈజీగా తగ్గిస్తాయి.ఇంకా వీటిల్లో ఉండే పోషకాలు చెమటను ప్రొత్సహిస్తాయి. ఈ చెమట వల్ల శరీరంలోని వ్యర్థాలు ఈజీగా బయటకు వెళ్తాయి.అలాగే పచ్చి మిరపకాయల్లో విటమిన్లు ఏ, సి వంటివి మెండుగా ఉంటాయి. ఇంకా అలాగే దీనిలో రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పచ్చి మిర్చి తింటే బాడీలో ఇమ్యూనిటీని కూడా పెరుగుతుంది. విటమిన్ ఏ కంటి చూపును మెరుగు పరచడంలో చాలా హెల్ప్ చేస్తుంది.ఇంకా విటమిన్ సి చర్మ రక్షణకు సహకరిస్తుంది.ఇక పచ్చి మిర్చి రక్త పోటును, కొలెస్ట్రాల్ ను స్థాయిలను తగ్గించడంలో సహాయ పడుతుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. వీటిని మితంగా తీసుకుంటే మాత్రం గుండె పని తీరు చాలా ఆరోగ్యంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇంకా అలాగే రక్తంలో కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ లెవల్స్ ను కంట్రోల్ లోకి తీసుకువస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: