చలి కాలంలో కీళ్ల నొప్పులు, వెన్ను నొప్పి తగ్గే టిప్స్ ?


ఈ చలి కాలంలో కీళ్ల నొప్పులు, వెన్ను నొప్పి వంటి సమస్యలు సాధారణంగా వెంటాడుతాయి. ఉష్ణోగ్రత తగ్గినప్పుడు, కీళ్లలోని రక్త నాళాలు సులభంగా కుంచించుకుపోతాయి. అందువల్ల కీళ్లపై ఒత్తిడి ఏర్పడి నొప్పి వస్తుంది.అందువల్లనే చలి కాలంలో కీళ్ల నొప్పులు బాగా పెరుగుతాయి.చలికాలంలో ఆహారంలో డ్రై ఫ్రూట్స్‌ను ఖచ్చితంగా చేర్చుకోవాలి. ఎందుకంటే డ్రై ఫ్రూట్స్‌లలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. కీళ్ల నొప్పులు తగ్గడానికి వాల్‌నట్‌లు, బాదం, అవిసె గింజలు ఇంకా చియా గింజలు మొదలైన వాటిని తినవచ్చు.చలికాలంలో ఖచ్చితంగా పాల ఉత్పత్తులను ఎక్కువగా తీసుకోవాలి. మీరు పాలు, చీజ్, పుల్లని పెరుగు తినడానికి ప్రయత్నించాలి. వాటిలో కాల్షియం, విటమిన్ డి ఎక్కువగా ఉంటాయి. ఇవి ఎముకల ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.ఖచ్చితంగా ప్రతి రోజూ భోజనంలో వెల్లుల్లి తినాలి. 


పచ్చి వెల్లుల్లి తినడం వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. వెల్లుల్లి తినడం వల్ల కీళ్ల నొప్పులు రాకుండా జాగ్రత్త పడొచ్చు. వెల్లుల్లి మాదిరిగానే అల్లం కూడా కీళ్ల మంటను తగ్గించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా, అల్లం శీతాకాలంలో జలుబు, దగ్గు నుండి రక్షణ కల్పిస్తుంది. అల్లం టీ లేదా పొడి అల్లం వేడి నీటిలో కలుపుకుని తాగొచ్చు.అలాగే సీఫుడ్‌లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ డి ఉంటాయి. ఇవి శరీరంలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఏజెంట్లుగా పనిచేస్తాయి. వారానికి కనీసం 3 నుండి 4 సార్లు చేపలు తినాలి.అలాగే ఈ చలికాలంలో తక్కువ సూర్యకాంతి ఉంటుంది. దీని వల్ల శరీరంలో విటమిన్ డి లోపం ఏర్పడుతుంది. కాల్షియం, విటమిన్ డి లేకపోవడం వల్ల కీళ్ల నొప్పులు ఇంకా కండరాల నొప్పులు పెరుగుతాయి. కాబట్టి ఈ సీజన్‌లో కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం పొందడానికి ప్రతిరోజూ పైన తెలిపిన ఆహారాలు ఖచ్చితంగా తీసుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: