బాదాం బదులుగా..
బాదం అరకేజీ కొనే బదులుగా,మూడు కేజీల వేరుశనగలు కొనవచ్చు.వేరుశనగలను రోజు నానబెట్టి తీసుకోవడం వల్ల,బాదాం వల్ల వచ్చే న్యూట్రియన్స్ సెరటోనిన్,ఐరన్,కాల్షియం,మెగ్నీషియం,విటమిన్స్ మరియు మినరల్స్ పుష్కలంగా లభిస్తాయి.మరియు బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా.
ఖర్జురం బదులుగా..
ఖర్జూరం ఖర్చుతో కూడుకున్నది.కనుక తక్కువ ఖర్చులో మరియు అందరికీ లభించే అరటిపండును తీసుకోవచ్చు.రోజుకో అరటిపండు తీసుకోవడం వల్ల, ఖర్జూరంలో ఉన్న ఫైబర్,పాస్పరస్,సోడియం, పొటాషియం,విటమిన్స్ అండ్ మినరల్స్ పుష్కలంగా లభిస్తాయి.
జీడిపప్పు బదులుగా..
జీడిపప్పు బదులుగా పుచ్చ గింజలను ఎంచుకోవడం చాలా ఉత్తమం.జీడిపప్పులో లభించే ఐరన్,ప్రోటీన్, క్యాలిషియం వంటి పోషకాలు అన్ని పుచ్చ గింజలలో లభిస్తాయి.కావున ఈ సారి పుచ్చకాయలు ఇంటికి తెచ్చుకున్నప్పుడు,గింజలను మాత్రం అస్సలు పడేయకండి.
పిస్తా బదులుగా..
పిస్తా..అన్ని డ్రై ఫ్రూట్స్ కన్నా అత్యంత ఖరీదైన డ్రై ఫ్రూట్ అని చెప్పవచ్చు.ఈ డ్రైఫ్రూట్ బదులుగా లినిడ్స్ తీసుకోవడం చాలా ఉత్తమం.ఈ లినిడ్స్ లో పిస్తాలో దొరికే ఫైబర్ విటమిన్ లు,మంచి కొవ్వులు,ఫైటో న్యుట్రీయట్స్,యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి.
కిస్మిస్ బదులుగా..
కిస్మిస్ బదులుగా శనగలను నానబెట్టి తీసుకోవచ్చు. శనగలలో అధిక ఫైబర్,ఎన్నో విటమిన్స్ లభిస్తాయి. వీటిని గుప్పెడు తిన్నా సరే పొట్ట నిండిన భావన కలిగి, అధిక ఆహారం తీసుకోవలనే భావన తగ్గిపోతుంది. మరియు తరచూ శనగలను తీసుకోవడం వల్ల బరువును కూడా తగ్గించుకోవచ్చు.
కావున ఎవరైతే డ్రై ఫ్రూట్స్ భారం అనుకుంటారో,అలాంటి వారందరికీ పైన చెప్పిన ఆహారాలు అన్ని వరమని చెప్పవచ్చు.మీరు కూడా అలానే ఉంటే కచ్చితంగా పైన చెప్పిన ఆహారాలను మీ డైట్ లో చేర్చుకోండి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి