రోజు మనం తినే బ్రేక్ఫాస్ట్ లో మినపగుళ్ళు తప్పనిసరి. ఇడ్లీ,దోస,వడ,గారే,పునుగు,ఇలా ఏ బ్రేక్ఫాస్ట్ తీసుకున్న అందులో మినపగుళ్ళు తప్పనిసరి.ఇవి ముఖ్యపాత్ర వహిస్తాయి.మినపగుళ్ళు వాడటమే కాదు, వాటివల్ల కలిగే ప్రయోజనాలు కూడా తెలుసుకుందాం. మినపగుళ్ళు వేయటం వల్ల దోశలు కానీ ఇడ్లీ కానీ మృదువుగా వస్తాయి,మంచి రుచితో సాఫ్ట్ గా ఉండటం వల్ల ఇంకా ఎక్కువగా తినవచ్చు.ఇది లైట్ ఫుడ్ కాబట్టి కొంతమంది  రాత్రుళ్ళు అన్నానికి బదులు ఇలా దోస ఇడ్లీలు తింటారు.ఈ మినప గుళ్ళలో ఐరన్ పుష్కళంగా ఉంటుంది. శరీరానికి మంచి బలాన్ని చేకూరుస్తుంది.ఇందులో క్యాల్షియం కూడా ఎక్కువగానే ఉంటుంది.ఎముకలు బలంగా దృఢంగా తయారవుతాయి.ఇందులో ఫైబర్ మెండుగా ఉంటుంది.తరచూ వీటిని తినడం వల్ల తిన్న ఆహారం బాగా అరుగుదల అవుతుంది.జీర్ణ  సమస్యలు తగ్గిస్తుంది.మలబద్దకాన్ని నివారిస్తుంది.మనపగుళ్ళే కాకుండా మినుములతో చేసిన లడ్డు కూడా ఆరోగ్యనికి ఎంతో మంచిది.మినుములతో చేసిన లడ్డును సున్నిలడ్డు అంటారు.


ఎదిగే పిల్లలకి దీన్ని తినడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి.ముఖ్యంగా ఆడపిల్లకి వీటిని వేపి దంచి పొడి చేసి దానిలో కావాసినంత నెయ్యి వేసి స్వచ్ఛమైన బెల్లంపొడిని కలిపి లడ్డులా చేసి వీటిని రోజుకో లడ్డు వాళ్ళకి ఇవ్వడం వల్ల ఎంతో ఉపయోగం ఉంది.ముందుగానే వీటిని ఇవ్వడం వల్ల వీళ్ళు వయసుకు వచ్చినప్పుడు రుతుక్రమసమస్యలు రాకుండా ముందుగానే బాడీ ని ప్రిపేర్ చేసి ప్రొటక్ట్ చేస్తుంది.నెలసరి టైం లో నడుమునొప్పి విపరీతంగా బాధిస్తుంది.అలాంటి టైం లో ఇలా లడ్డు చేసుకొని తినడం వల్ల నడుమునొప్పి,కడుపు నొప్పి,కాళ్ళు చేతులు లాగడం లాంటి వాటికి చెక్ పెట్టవచ్చు.మన అమ్మమ్మల కాలం నాటి నుండి దీన్ని ఫాలో అవుతు వస్తున్నారు.అందుకే అప్పటి వారికి ఇలాంటి ఇబ్బందులు వచ్చేవి కావు.అబ్బాయిలకి అయితే శుక్ర కణాల సంఖ్య పెట్టగడంలో ఇది సహాయపడుతుంది.బలమైన చురుకైనా కదలికలు కలిగిన కణాలను ఉత్పత్తి చేస్తుంది.కావున ఈ మినుములతో చేసిన లడ్డూను రోజుకి ఒకటి తినడం వల్ల పైన చెప్పిన సమస్యలని పోగొట్టుకొని ఆరోగ్యంగా ఉండొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: