గోంగూర పచ్చడి అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరూ ఉండరు. మనం రకరకాల పచ్చళ్ళు తింటూ ఉంటాము.అందులో గోంగూర పచ్చడి ఎంతో స్పెషల్. దీన్ని ఎక్కువగా ఇష్టపడే వారు చాలా మంది ఉన్నారు.ఈ గోంగూరతో చాలా రకాల వంటలు చేసుకోవచ్చు,గోంగూరతో నిల్వ పచ్చడి, గోంగూర పప్పు,గోంగూర పులుసు,ఎండు చేప గోంగూర, మటన్ గోంగూర, బోటి గోంగూర,గోంగూరతో రోటీ పచ్చడి, అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి.టమాటా పచ్చిమిర్చి కరివేపాకు మెక్కలతో ఈ గోంగూర మొక్కలు కూడా కామన్ గా పెంచుతూ ఉంటారు.అయితే విలేజ్ స్టైల్లో ఈ గోంగూర రోటి పచ్చడిని ఇప్పుడు ఎలా చేయాలో తెలుసుకుందాం. 


ముందుగా యాభై గ్రాములు ఎండుమిర్చి తీసుకొని స్టవ్ పైన మూకుడు పెట్టి అందులో ఆయిల్ వేసి బాగా వేపి పక్కన పెట్టుకోవాలి.అదే మూకుడిలో ఎనిమిది చిన్న సైజ్ కట్టల గోంగూరని తీసుకుని బాగా నీళ్లతో శుభ్రం చేసి వేసుకోవాలి. గోంగూర బాగా మగ్గిన తరవాత, ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న ఎండుమిర్చి ని రోట్లో వేసుకొని బాగా మెదిగే వరకు దంచుకోవాలి. ఇప్పుడు దానిలో రుచికి సరిపడా కల్లుప్పు వేసి హాఫ్ చెంచా జీలకర్ర వేసి దంచుకోవాలి. ఇందులోనే యాభై గ్రాములు చింతపండు వేసుకుని, ఆరు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి అన్ని బాగా కలిసేలా నూరుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి. తరువాత రోస్ట్ చేసి పెట్టుకున్న గోంగూరని రోట్లో వేసి బాగా నూరి అందులో ఒక ఉల్లిపాయ కూడా వేసి కచ్చపాచ్చాగా నూరుకోవాలి. ఇప్పుడు ఇందులో నూరిపెట్టుకున్న ఎండుమిర్చి మిశ్రమాన్ని వేసి రెండు కలిసేలా బాగా రోట్లోనే రుబ్బుకోవాలి.రుబ్బుకున్న ఈ పచ్చడిని ఒక గిన్నెలోకి తీస్సుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కాస్త ఆయిల్ వేసి అందులో కొంచం జీలకర్ర ఆవాలు వెల్లుల్లి,రెండు ఎండుమిర్చి కొంచం ఇంగువ వేసి పోపు పెట్టుకోవాలి. ఈ పోపుని పచ్చడిలో వేసి రెండు బాగా కలిసేలా కలుపుకోవాలి. అంతే విలేజ్ స్టయిల్ రోటీ గోంగూర పచ్చడి రెడీ. వేడి వేడి అన్నం లో ఈ పచ్చడి వేసుకొని కాస్త నెయ్యి వేసుకొని తింటుంటే ఆ రుచే వేరు. మరి మీరు కూడా ఇలా ట్రై చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: