మనం రోజు తినే కూరగాయాలలో వంకాయకి ఉన్న క్రేజే వేరే. వంకాయలతో అనేక రకాల కూరలు ఫ్రై లు చేసుకుంటాము. అయితే ఇవాళ వంకాయ రొటీ పచ్చడి గురించి తెలుసుకుందాం.ముందుగా హాఫ్ కేజీ వంకాయాలని తీసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ లో ఆయిల్ వేసుకొని,కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలని వేసి బాగా ముక్క మగ్గే వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి.ఇపుడు అదే పాన్ లో పదిహేను ఎండుమిరపకాయలు కూడా వేసుకొని ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ వేపుకున్న ఎండుమిరపకాయలని రోట్లో వేసి బాగా దంచి అందులో రుచికి సరిపడా ఉప్పు వేసి నాలుగు వెల్లుల్లి రెబ్బలు,ఒక స్పూన్ జీలకర్ర,వేసి బాగా నూరుకోవాలి.తరువాత ఇందులోనే గుప్పెడు కరివేపాకు,గుప్పెడు కొత్తిమీర వేసుకుని రెండు చిన్న సైజ్ ఉల్లిపాయలని ముక్కలుగా కట్ చేసుకుని వేసి మరీ మెత్తగా కాకుండ కచ్చా పచ్చాగా నూరుకోవాలి.తరువాత ఇందులో మనం ముందుగా వేపి పక్కన పెట్టుకున్న వంకాయ ముక్కలని వేసి బాగా నూరుకోవాలి.


ఇపుడు ఒక నిమ్మకాయ సైజ్ చింతపండును జ్యూస్ తీసి ఇందులో వేయాలి. మొత్తం కలిసేలా పచ్చడిని రుబ్బుకోవాలి.ఇప్పుడు ఈ పచ్చడికి పోపు పెట్టుకోవాలి.గిన్నెలో ఆయిల్ వేసి హాఫ్ స్పూన్ పచ్చి సెనగ పప్పు,హాఫ్ స్పూన్ ఆవాలు,హాఫ్ స్పూన్ జీలకర్ర,వేసి చిటపటలాడాక, అందులో నాలుగు వెల్లుల్లి దంచి వేసుకోవాలి,రెండు ఎండుమిర్చి,కొంచం కరివేపాకు కూడా వేసి పోపు పెట్టుకోవాలి.ఈ పోపుని మన తయారు చేసుకున్న వంకాయ పచ్చడిలో వేసి బాగా కలపాలి.అంతే టేస్టీ గా ఉండే వంకాయ రొటీ పచ్చడి రెడీ.ఈ పచ్చడి చేసిన రోజు పక్కన ఎన్ని కూరలు ఉన్న సైడ్ కి తోసేసి ఈ పచ్చడితో ఓ పట్టు పడతారు.అంత కమ్మగా ఉంటుంది.తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీ. సమయం కూడా తక్కువ పడుతుంది.మరి మనకి ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే ఈ వంకాయలతో పైన చెప్పిన విధంగా రొటీ పచ్చడి తయారు చేసి చూడండి.ఇంటిల్లా పాది మళ్ళీ మళ్ళీ ఈ పచ్చడి చేసిపెట్టమని అడుగుతారు.వంకాయ మనం తినే అని కూరగాయాలలో దీనికి ఉండే ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు.అందుకే అన్ని కూరగాయలకి ఇది రాజు అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: