రాగులు ఆరోగ్యానికి చాలా విధాలుగా మేలు చేస్తాయి. ముఖ్యంగా అధిక బరువు త్వరగా తగ్గాలనుకునే వారు ఖచ్చితంగా రాగులతో చేసిన ఆహారాన్ని తింటూ ఉండాలి. ఎందుకంటే దీనిలో బరువు తగ్గించే లక్షణాలు ఉన్నాయి. అధిక ఫైబర్ కంటెంట్ అనేది ఉండటం వల్ల రాగిజావ తాగాక పొట్ట నిండిన ఫీలింగ్ కలుగుతుంది. ఇంకా అలాగే దీని నుండి తక్కువ క్యాలరీలు శరీరానికి అందుతాయి. దీనిలో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువ. కాబట్టి అధిక బరువు కూడా చాలా త్వరగా తగ్గుతారు. కేవలం రాగి జావ మాత్రమే కాదు రాగులతో ఇడ్లీలు చేసుకుని తిన్నా కూడా ఆరోగ్యానికి చాలా మంచిది.లేదా వీటిని దోశెల్లా వేసుకున్నా మంచిదే. అన్నిటి మీద రాగిజావ మాత్రం ఎక్కువ పోషకాలను శరీరానికి అందిస్తుంది. శాకాహారులు ప్రోటీన్ కోసం రాగిజావని తినవచ్చు.ప్రతిరోజూ రాగిజావ తాగే వారు బలంగా ఉంటారు. మానసికంగా వారు దృఢంగా ఉంటారు. వారి ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి. భవిష్యత్తులో బోలు ఎముకల వ్యాధి వచ్చే అవకాశం తగ్గుతుంది. దీనిలో కాల్షియం అధికంగా ఉంటుంది. కాబట్టి ఎముకలకు ఎంతో మంచిది. అస్థిపంజర వ్యవస్థను ఇది కాపాడుతుంది.


 డయాబెటిస్‌తో బాధపడేవారు కచ్చితంగా తినాల్సిన వాటిలో రాగిజావ ఒకటి. ఇది యాంటీ డయాబెటిక్, యాంటీ ఆక్సిడెంట్, యాంటీబయోక్రోబయల్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఎవరైతే ఐరన్ లోపంతో బాధపడుతూ ఉంటారు. అలాంటి వారు రాగిజావను ప్రతిరోజూ తినాలి. ముఖ్యంగా మహిళలు, పిల్లలు, రాగి పిండితో చేసే ఆహారాలను తినాల్సిన అవసరం ఉంది. వీరిలోనే ఎక్కువగా రక్తహీనత సమస్య కనిపిస్తూ ఉంటుంది. జీర్ణ క్రియ ఆరోగ్యం కోసం కూడా రాగులను తినాలి. ఎందుకంటే దీనిలో డైటరీ ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణ సమస్యలు రాకుండా అడ్డుకుంటుంది.రాగి జావని ప్రతిరోజూ తీసుకుంటే గుండె జబ్బులు వచ్చే ప్రమాదం చాలా వరకు తగ్గిపోతుంది. రాగుల్లో విటమిన్ సి, బీ కాంప్లెక్స్, విటమిన్లు, ఐరన్, క్యాల్షియం, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవన్నీ కూడా మన శరీరానికి అత్యవసరమైనవి. ప్రతిరోజూ రాగిజావనూ తాగడం వల్ల మన శరీరానికి ఇవన్నీ అందుతాయి. అందుకే రాగులతో చేసిన ఆహారాలను కచ్చితంగా ప్రతిరోజూ తినాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: