
మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే ప్రతిరోజు ఆహారంలో తాజా కూరగాయలు ,ఆకుకూరలు, పండ్లను ఆహారంలో చేర్చుకోవాలి. ముఖ్యంగా ఆకుకూరలను తరచూ మనం తీసుకోవడం వల్ల మన శరీరానికి కావలసిన ఖనిజాలు విటమిన్స్, పోషకాలు అన్నీ కూడా పుష్కలంగా లభిస్తాయి. ఆకుకూరలలో క్యాలరీలు తక్కువగా ఉండి ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల బరువు తగ్గాలనుకునే వారికి చాలా ఉపయోగపడుతుంది. అయితే మనం ఆకుకూరలను వండుకునే సమయాలలో కొన్ని జాగ్రత్తలను తీసుకుంటే.. మన శరీరానికి ఆకుకూరలలో ఉండే పోషకాలు అందుతాయి. మరి ఆకుకూరలు వండేటప్పుడు తీసుకోవలసిన కొన్ని టిప్స్ గురించి ఇప్పుడు చూద్దాం.
ఆకుకూరలను, కాయగూరలను వండే ముందు కచ్చితంగా గోరువెచ్చని నీటిలో మరిగించి కూర చేసుకోవడం వల్ల ఇందులో ఉండే పోషకాలు బయటికి వెళ్ళవు.
వంట చేసేటప్పుడు కొంత నిమ్మరసాన్ని కలపడం వల్ల కూర మరింత రుచిగా ఉంటుంది.
మనలో కొంతమంది ఆకుకూరలను వండేటప్పుడు స్ట్రీమింగ్ పద్ధతిలో ఉడికిస్తూ ఉంటారు. అయితే ఇలా చేయడం వల్ల చాలా మంచిది. ఇందులో పోషకాలు ఆకుకూరల్లోనే ఉంటాయి.
ఆకుపచ్చని కాయగూరలని వండేటప్పుడు అందులోకి మిరియాల పొడి, అల్లం, వెల్లుల్లి పేస్టు, కారం వంటివి తగిలించడం వల్ల టేస్ట్ మారడమే కాకుండా పోషకాలు కూడా మన శరీరానికి అందుతాయి.
ఆకుకూరలను డ్రైగా చేస్తే ఆకుకూరలలో ఉండే పోషకాలు ఆవిరైపోతాయి. అందుకే ఆకుకూరలు ఫ్రై చేసుకునేటప్పుడు కొంత నీటిని యాడ్ చేసుకోవాలి.
కాయగూరలతో వంట చేసేటప్పుడు చిన్న చిన్న ముక్కలు కాకుండా పెద్ద పెద్ద ముక్కలుగా ఉండేలా చూసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఇందులో ఉండే పోషకాలు నశించకుండా అలాగే ఉంటాయి.
కొంతమంది ఒకసారి చేసిన వంటను తిరిగి మళ్లీ వేడి చేసుకొని తింటూ ఉంటారు. ఇలా ఏ పదార్థాలనైనా సరే ప్రతిసారి వేడి చేసి తినడం వల్ల చాలా ప్రమాదమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆకుకూరలో ఉండే పోషకాలు నశించడమే కాకుండా ప్రమాదకరంగా మారుతుంది.