
పడుకునే సమయానికి ఒక గంట ముందు ఫోన్, టీవీ, ల్యాప్‌టాప్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను వాడటం మానేయండి. వీటి నుండి వెలువడే నీలి కాంతి మెదడును చురుకుగా ఉంచుతుంది, దీంతో నిద్ర పట్టదు. ప్రతిరోజు ఒకే సమయానికి పడుకుని, ఒకే సమయానికి లేవడానికి ప్రయత్నించండి. దీనివల్ల మీ శరీరం అలవాటు పడి, నిద్ర వేళలకు అనుగుణంగా మారుతుంది.
పడుకునే ముందు ఒకసారి వేడినీళ్ళతో స్నానం చేయండి. ఇది శరీరానికి, మనసుకు విశ్రాంతినిచ్చి, నిద్ర బాగా పట్టేలా చేస్తుంది. పడుకునే గది ప్రశాంతంగా, చీకటిగా, చల్లగా ఉండేలా చూసుకోండి. రాత్రి సమయంలో ఎక్కువ ఆహారం తీసుకోకండి. కనీసం రెండు గంటల ముందు భోజనం ముగించండి. అదే విధంగా కెఫిన్ అధికంగా ఉండే కాఫీ, టీలు సాయంత్రం 5 గంటల తర్వాత తాగకండి.
ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా, ధ్యానం, శ్వాస వ్యాయామాలు వంటివి చేయండి. పడుకునే ముందు పుస్తకాలు చదవడం లేదా మంచి పాటలు వినడం వంటివి అలవాటు చేసుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఈ చిట్కాలను పాటిస్తే, మీరు ప్రశాంతమైన నిద్రను ఆస్వాదించవచ్చు. ఈ చిట్కాలను పాటించడం ద్వారా నిద్రలేమి సమస్య సైతం దూరమవుతుంది.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు