మార్చి 5వ తేదీన ఒక చరిత్రలోకి వెళితే ఎన్నో ముఖ్య సంఘటనలు ఎంతో మంది ప్రముఖుల మరణాలు ఇంకెంతో మంది ప్రముఖుల జననాలు   జరిగాయి. మరి ఒకసారి నేడు చరిత్ర లోకి వెళ్లి ఏం జరిగిందో తెలుసుకుందాం రండి. 

 

 కిషన్ రెడ్డి ఎన్నిక : ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా జి.కిషన్ రెడ్డి 2010 మార్చి 5వ తేదీన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పార్టీలో ఎన్నో ఏళ్లుగా కొనసాగుతూ వస్తున్న కిషన్ రెడ్డి  ప్రస్తుతం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా కొనసాగుతున్నారు. 

 

 ఈలపాట రఘురామయ్య  జననం : ఈలపాట రఘురామయ్య గా ప్రఖ్యాతి చెందిన కల్యాణం వెంకట సుబ్బయ్య సుప్రసిద్ధ రంగస్థల మరియు సినిమా నటుడు. మరియు ఎన్నో సినిమాల్లో గాయకుడిగా కూడా సుపరిచితులు. కృష్ణుడు దుష్యంతుడు నారదుడు లాంటి  పాత్రలను ఈయన వేదికపై రక్తి కట్టించేవారు. 60 ఏళ్ల తన వృత్తి జీవితంలో ఎన్నో నాటకాలు ఆడి  ప్రసిద్ధి చెందారు. 1901 మార్చి 5వ తేదీన జన్మించారు. 

 

 కాంచనమాల జననం : తొలితరం నటీమణుల్లో ఒకరైన కాంచనమాల 1917 మార్చి 5వ తేదీన జన్మించారు. ఆంధ్రా ప్యారిస్ గా  పేరుపొందిన తెనాలి పట్టణం ఆవిడ స్వస్థలం. ఆ కాలంలో బాగా పేరు తెచ్చుకున్న నటీమణులలో కాంచనమాల కూడా ఒకరు. ఈమె  తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతగానో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారు. 1981 సంవత్సరంలో మరణించారు. 

 

 

 ఆల్కె పదంసీ జననం  : ఎన్నో ప్రతిష్టాత్మక అడ్వర్టైజ్మెంట్ లకు సృష్టికర్త అయిన ఆల్కే  పదంసీ 1928 మార్చి 5వ తేదీన జన్మించారు. 1982 సంవత్సరంలో వచ్చిన చారిత్రాత్మక చిత్రం గాంధీలో మహ్మద్ ఆలీ జిన్నా పాత్రలో నటించి అందరి మన్ననలు అందుకున్నాడు. ఇక  భారత అంతర్జాతీయ వాణిజ్య ప్రకటనలు తనదైన స్టైల్ లో అద్భుమైనా అడ్వర్టైజ్మెంట్ లతో ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. 

 

 

 నాజర్ జననం  : దక్షిణాది చిత్ర పరిశ్రమకు చెందిన సుప్రసిద్ధ నటుడు నాజర్ 1958లో మార్చి 5వ తేదీన జన్మించారు. స్వతహాగా తమిళనాడుకు చెందిన ఈయన  తెలుగుతో పాటు తమిళ కన్నడ భాషల్లో కూడా ఎన్నో సినిమాల్లో నటించారు. ఎక్కువగా ప్రతినాయకుడి పాత్రలో నటించి ఎన్నో పురస్కారాలను సైతం అందుకున్నారు. పలు సినిమాల్లో కీలకపాత్రల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించిన.. అటు తమిళ కన్నడ భాష సినిమాల్లో  కూడా ఎన్నో కీలక పాత్రల్లో నటించారు. ఇప్పటికీ తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నారు నాజర్ . కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 

 

 

 ఆర్తి అగర్వాల్ జననం : తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ తెలుగు సినీ నటి అయిన ఆర్తి అగర్వాల్ తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయికగా కొనసాగింది. ప్రముఖ నిర్మాత డి.సురేష్ బాబు నిర్మించిన నువ్వు నాకు నచ్చావ్ అనే సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ఆర్తి అగర్వాల్... మొదటి సినిమాలో వెంకటేష్ తో జోడీ కట్టి మంచి విజయాన్ని అందుకున్నారు. 2000వ దశకం లో అగ్ర కథానాయకులంతా భావించిన చిరంజీవి వెంకటేష్ బాలకృష్ణ మరియు నాగార్జున సరసన ఎన్నో సినిమాల్లో నటించింది ఈ అమ్మడు. జూనియర్ హీరోల సరసన కూడా ఎన్నో సినిమాల్లో నటించింది. ఇక వెంకటేష్ సరసన నటించిన మూడు సినిమాలు మంచి  విజయాన్ని సాధించిపెట్టాయి ఆర్తి అగర్వాల్ కు. ఇక చిరంజీవి తో నటించిన ఇంద్ర సినిమాతో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది ఆర్తి అగర్వాల్. ఇక తెలుగులోనే కాకుండా తమిళం సినిమాల్లో కూడా నటించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అంతే కాకుండా పలు హిందీ సినిమాల్లో కూడా నటించింది. 2015 జూన్ 5వ తేదీన ఆర్తి అగర్వాల్ మరణించింది. 

 

 

 జెకె రితేష్ జననం : ప్రముఖ భారతీయ నటుడు పొలిటిషన్ అయిన జేకే రితీష్  ఎక్కువగా తమిళ ప్రేక్షకులకు కొసమెరుపు.  ఎన్నో తమిళ సినిమాలలో నటించిన ఈయన... ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. రాజకీయాల్లో కూడా రాణిస్తున్నారు. ఈయన  1973 మార్చి 5వ తేదీన జన్మించారు.

 

 

 సెల్వరాఘవన్ జననం  : దక్షిణాది చిత్ర పరిశ్రమలో ఎంతగానో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు సెల్వరాఘవన్ 1976 మార్చి 5వ తేదీన జన్మించారు. తనదైన స్టైల్లో దర్శకత్వం వహించి  ఎన్నో సినిమాలతో  విజయం అందుకొన్నారు. ఎన్నో విభిన్నమైన కథలతో సినిమాలను తెరకెక్కించే తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు సెల్వరాఘవన్. 

 

 

 పిఠాపురం నాగేశ్వరరావు మరణం : ప్రముఖ సినీ సంగీత దర్శకులు అయిన పిఠాపురం నాగేశ్వరరావు 1996 మార్చి 5వ తేదీన జన్మించారు. ఈయన ఆనాటి సినిమాల్లో ఎంతో అద్భుతంగా నేపథ్య సంగీతాన్ని సమకూర్చారు అంతే కాకుండా ఎన్నో సినిమాల్లో పాటలు కూడా పాడారు.

 

 

 కొంగర జగ్గయ్య మరణం : ప్రముఖ తెలుగు సినిమా రంగస్థలం నటుడు రచయిత పాత్రికేయుడు మాజీ పార్లమెంటు సభ్యుడు మరియు ఆకాశవాణిలో తొలితరం తెలుగు వార్తల చదువరి కొంగర జగ్గయ్య 2004 మార్చి 5వ తేదీన మరణించారు. ఈయన అనేక నాటకాలలో ను వేసిన పాత్రలతో  ఆంధ్రులకు సుపరిచితులు గా మారారు.

మరింత సమాచారం తెలుసుకోండి: