సంవ‌త్సంరంలోని క్యాలెండ‌ర్‌ లోని ప్ర‌తి రోజుకు ఒక ప్రాముఖ్య‌త ఉంది. చ‌రిత్ర‌లో ఈ రోజుకు ఉన్న ప్ర‌త్యేక‌తే వేరుగా చెప్పాలి. ఈ రోజు ప్ర‌పంచంలో అనేక అద్భుతాలు, కొన్ని విషాద పూరిత ఘ‌ట‌న‌లు జ‌రిగాయి. ఎంద‌రో మ‌హానుభావులు జ‌న్మించారు. మ‌రెన్నో విషాద‌క‌ర ఘ‌ట‌న‌లు జ‌రిగాయి. అలాంటివి ఏమేం ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

♥ జననాలు ♥

✦   1694: ఫ్రాంకోయిస్ కేనే ప్రాచీన ఆర్థిక శాస్త్ర విభాగాలలో ఒకటైన ఫిజియోక్రటిక్ స్కూల్ స్థాపకుడు. (మ.1774)
✦    1897: వెన్నెలకంటి రాఘవయ్య, స్వరాజ్య సంఘం స్థాపకుడు. (మ.1981)
✦    1944: కిడాంబి రఘునాథ్, శాస్త్రవేత్త, పత్రికా సంపాదకులు. (మ.2003)
✦    1946: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, తెలుగు నేపథ్య గాయకుడు, సంగీత దర్శకుడు, నటుడు. (మ.2020)
✦    1950: ఎస్. పి. వై. రెడ్డి, నంది గ్రూప్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపకుడు, అధినేత.
✦    1961: ఎం. ఎం. కీరవాణి, తెలుగు చలనచిత్ర సంగీతదర్శకుడు, గాయకుడు.
✦    1984: ప్రియమణి, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ నటి.


♡ మరణాలు ♡

✦ 1798 : ఇటలీ లోని వెనిస్‌ కు చెందిన ఒక సాహసికుడు గియాకోమో కాసనోవా మరణం (జ.1725).
✦ 1998: ఆరుద్ర, కవి, గేయ రచయిత, సాహితీవేత్త, కథకుడు, నవలారచయిత, విమర్శకుడు, పరిశోధకుడు, అనువాదకుడు ( జ.1925).
✦ 2001: దీపేంద్ర, నేపాల్ రాజుగా పనిచేశారు (జ.1971).
✦ 2006: బూదరాజు రాధాకృష్ణ, భాషావేత్త (జ.1932).


✷ పండుగలు , జాతీయ దినాలు✷

అంతర్జాతీయ పీడిత బాలల దినోత్సవం.
 

✷ సంఘటనలు ✷


✦  1938: మూడవ ప్రపంచ కప్ ఫుట్‌బాల్ పోటీలు ఫ్రాన్సులో ప్రారంభమయ్యాయి.


✦   2004: భారత లోక్‌సభ స్పీకర్‌గా సోమనాధ్ చటర్జీ పదవిని స్వీకరించాడు.

✦    2010: జపాన్ ప్రధానమంత్రిగా నవోతో కాన్ ఎంపికయ్యాడు.

✦    2019: తెలుగు వికీపీడియా సభ్యుడు ప్రణయ్‌రాజ్ వంగరి 'వికీఛాలెంజ్' అనే కాన్సెప్ట్‌తో వరుసగా 1000రోజులు - 1000వ్యాసాలు రాసి, ప్రపంచం మొత్తం వికీపీడియాల్లో ఈ ఘనత సాధించిన మొదటి వికీపీడియన్‌గా చరిత్ర సృష్టించాడు. 2016, సెప్టెంబరు 8వ తేది నుండి తెలుగు వికీపీడియాలో ప్రతిరోజు ఒక వ్యాసం చొప్పున రాస్తూ 2019, జూన్ 4న 'వికీవెయ్యిరోజులు' పూర్తిచేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: