ఓసారి ఒక దేవత, ఒక దానవుడు ఆత్మజ్ఞానం కోసం ఒక మహర్షి వద్దకు వెళ్లారు. చాలా కాలం మహర్షిని సేవించి, విద్య నేర్చుకున్నరు. చివరికి ఆ మహర్షి, ‘‘ మీరు దేనికోసం అన్వేషిస్తున్నారో, అది మీలోనే ఉంది’’ అని చెప్పాడు. అది విని, ఆ ఇద్దరూ ‘ అంటే శరీరమే ఆత్మ అన్నమాట’ అని భావించి, తమవారి వద్దకు వెళ్లిపోయారు. ‘‘ మాకంతా తెలిసింది, శరీరంమే ఆత్మ, అంటే మనమే ఆత్మ కాబట్టి హాయిగా తింటూ, తాగుతూ సుఖంగా ఉందా, మను మించిన ఆత్మ లేదు కదా! అని తమవారికి బోధించారు. దానవుడు సహజంగా ముందబుద్ది, అందుకని ‘ ఆత్మ అంటే శరీరమే’ అన్న విషయం గూర్చి మరల ఆలోచించుకోలేదు. అదే వాస్తవం అని తృప్తిపడి, దాని ప్రకారం శరీరమే ఆత్మగా జీవించటం మొదలుపెట్టాడు. దేవత మందబుద్దికాడు. అతనిది విశుద్ధ బుద్ది, అయినా రుషి బోధన అతను కూడా మొదట్లో పొరపాటుగా అర్థం చేసుకున్నారు. ‘‘ ఈ శరీరమే ఆత్మ, కాబట్టి శరీరాన్ని బలంగా, ఆరోగ్యంగా ఉంచుకోవాలి, దివ్యంగా అలంకంరించుకోవాలి.  ఇంద్రియవిషయ భోగాలన్నీ బాగా అనుభవించాలి’’ అని అనుకున్నాడు, కొన్ని రోజులు అలా గడిచాయి. ఓ రోజు దేవతకు కాస్త అనుమానం వచ్చింది. ‘‘రుషి బోధకు అర్థం ఇది కాదేమో’ అను సంశయము అతడిలొ జనించింది. తీవ్రవగా ఆలోచించడు. ‘‘ దీనికన్నా మించిన అర్థం ఉండాలి, రుషినే అడుతాను’’ అని నిశ్చయించుకున్నాడు. మళ్లీ మహర్షి వద్దకు వెళ్లాడు. ‘‘ భగవాన్ ! ఈ శరీరమే ఆత్మనా ? మరి శరీరాలు నశించిపుతుంటవి కదా! ఆత్మ అవినాశి కదా ! మరి శరీరం ఆత్మ ఎలా ఔతుంది.’’ అని అడిగాడు. ‘‘ ఆ ఆత్మవు నువ్వే అదేమిటో నువ్వే తెలసుకో; తత్త్వమసి; అదే నువ్వు’’ అని మహర్షి చెప్పాడు.  దేవత మరల ఆలోచించాడు. ‘ ప్రాణం ఆత్మ కావచ్చు’’ అనుకున్నాడు. కాని తాను తిన్నప్పడు ప్రాణం శక్తివంతంగా ఉండడం, ఉపవాసం ఉన్నపుడు ప్రాణం నీరసంగా ఉండటం గమనించాడు. సందేహం కల్గింది. గురువు వద్దకు మళ్లీ వెళ్లాడు. ‘‘ ఆచార్య ! ప్రాణమే ఆత్మనా.’’ అని అడిగాడుజ ‘‘తత్త్వమసి అదే నువ్వు’’ అంటూ రుషి మరల అదే బోధచేశాడు. దేవత దీర్ఘంగా ఆలోచించాడు. ‘ బహుశ మనసు ఆత్మ కావచ్చు’ అని అనుకున్నాడు. ‘‘ కాని మనసులో మంచి భావాలే, చెడే భావాలు వస్తూపోతుంటాయి. మంచీ, చెడుల మిశ్రమం ఆత్మ ఎలా అవుతుంది? కాబట్టి మనసు ఆత్మ కాజాల’’దని నర్ణయించుకున్నాడు. మరల మహర్షిని ‘‘ మనసే ఆత్మ అంటారా’’ అనిఅడిగాడు. ‘‘ కాదు నువ్వే అది, తత్త్వమసి, కనుక్కో’’ అని మరల అదే బోధించాడు మహర్షి. దేవత మరంత దీక్షతో తత్త్వవిచారణలో మునిగిపోయాడు. అంతే ‘ తానే ఆత్మ’ అన్న సత్యం అతడికి స్పురించినది. అవాజ్మానసగోచరంచ అద్వితీయం, జననమరణ రహితం, కత్తులు, అగ్ని, వాయువు, జలం దేనితో కూడా ఎట్టి వికారానికి లోనుకానిది, ఆద్యతరహితం, అచలం, అస్పృశ్యం, సర్వజ్ఞం, సర్వశక్తిమంతం అయిన ఆత్మ తానేనని తెలుసుకున్నాడు.  తాను మనసుకు, శరీరానికి అన్నింటికీ అతీతుడ అన్న యథార్థం గ్రహించడు. దానితో ఆ దేవదతకు అవధులులేని ఆనందం కలిగింది. అయితే, పాపం ఆ దానవుడు మాత్రం శరీరంపైని వ్యామోహం వల్ల ఆత్మానందం లభించనే లేదు. నిరంకుశ ప్రకృతిని వశంచేసుకోవమే మీ లక్ష్యంగా ఉండాలి. ప్రకృతికి మనం బానిసలం కారాదు. అధిపతులు కావాలి. మనస్సు, శరీరం ఇ రెంటిలో ఏదీకూడా మన మీద పెత్తనం చేయకూడదు, శరీరం మన కాధీన తప్ప మనం శరీరానికి అధీనులం కామని గుర్తించుకోవాలి. అయినప్పటికీ శరీరాన్ని మనం చక్కగా సంరంక్షించుకోవాలి. ఎందుకంటే పరమార్థాన్ని పొందేందుకు మనకు వున్న మంచి సాధనం ఇ శరీరమే కదా.!  

మరింత సమాచారం తెలుసుకోండి: