దేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ కారణంగా ప్రతి ఒక్కరు తమ ఆరోగ్యంపై శ్రద్ద చూపిస్తున్నారు. ఇక వారిలో రోగనిరోధక శక్తిని పెంపొందించుకునేందుకు తగిన చర్యలు సూచిస్తున్నారు. అయితే చిన్నపిల్లలకు వైరస్, సూక్ష్మజీవులపై పెద్దగా అవగాహన ఉండదని చెప్తున్నారు. అంతేకాక.. పిల్లలు అనారోగ్యం బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంది. ఇక వారిలో రోగనిరోధక శక్తిని పెంచేందుకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించాలని సూచిస్తున్నారు. ఎలాంటి ఆహారం తీసుకోవాలో ఒక్కసారి చూద్దామా.

పిల్లలకు గుడ్లును ఎక్కువగా తినిపించాలి. అందులో విటమిన్-డి, జింక్. సెలినీయం, విటమిన్-ఈ వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఐయితే గుడ్లు పిల్లల్లో రోగనిరోధక శక్తిని పెంచుతాయని తెలిపారు. అంతేకాక.. అంతేకాకుండా ఇది ప్రోటీన్లకు మంచి ఔషధం. అయితే శిశువుల్లో శక్తిని అందించి వారికి రక్షణ కవచంలా పనిచేస్తుందని తెలిపారు. అంతేకాక.. సాల్మన్ చేపలో ఓమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు సమృద్ధిగా లభిస్తాయి. ఇందులో నొప్పిని నివారించి పిల్లల్లో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. కాగా.. పిల్లలను ఆరోగ్యాంగా ఉంచడానికి దోహదపడుతుంది.

అంతేకాక.. పిల్లలకు బాదం పెట్టడం కూడా మంచిదే. బాదంలో విటమిన్-ఈ, మాంగనీస్ సమృద్ధిగా  దొరుకుతాయి. ఇక రోజూ ఉదయాన్నే కొన్ని బాదం గింజలను తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని తెలిపారు. అంతేకాదు.. వీటిని పిల్లలకు స్నాక్స్ రూపంలో అందిస్తే మంచిదని సూచిస్తున్నారు. ఇక అధికబరువు తగ్గడంలోనూ బాదం గింజలు దోహదపడుతాయి. అలాగే.. పిల్లలకు పెరుగు తినిపించడం వలన సులభంగా జీర్ణమైతుందని తెలిపారు. ఇక ఇది రోగనిరోధక శక్తిని పెంపొందించేందుకు దోహద పడుతుంది. అంతేకాక.. పెరుగు పిల్లలో ఉండే వేడిని తగ్గిస్తుంది.

ఇక పిల్లలకు బెర్రీలు తినిపించడం కూడా మంచిదే. అందులో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. అంతేకాక.. ఇది హానికరమైన సూక్ష్మజీవుల నుంచి రక్షణ కలిపిస్తుంది. కాగా.. సులభంగా జీర్ణమయ్యే ఈ ఆహారం మంచి డైట్ గాను సహాయపడుతుంది. ఇక ముఖ్యంగా పిల్లలు వీటిని ఎంతో ఇష్టపడి తింటుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: