
కొన్ని కొన్ని ప్రాంతాల లో హోలీ పండుగను కాస్త వింత ఆచారాల ప్రకారం జరుపుకోవడం కూడా చూస్తూ ఉంటాం. ఇలాంటిది ఏదైనా జరిగితే అది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది అని చెప్పాలి. ఇక కర్నూలు జిల్లాలో కూడా ఇలాంటి ఆచారమే ఉంది. కర్నూలు జిల్లాలోని ఆదోని మండలంలో హోలీ పండుగ రోజు మగవాళ్ళు మగువలుగా మారిపోతారు. అచ్చం జంబలకిడిపంబ సినిమాలో చూపించినట్లుగానే ఇక్కడ ఆచారాన్ని పాటిస్తూ ఉంటారు. ఆంధ్రప్రదేశ్ కర్ణాటక సరిహద్దు బోర్డర్లో ఉండే సంతే గుడ్లూరు గ్రామంలో హోలీ పండుగ రోజున ఈ వింత ఆచారం కొనసాగుతుంది.
మగవాళ్ళు ఆడవాళ్ళలా వేష ధారణ వేసుకుని రతి మన్మధులను పూజిస్తారు. ఇక ఇలా పూజ చేయడం వల్ల అంతే మంచి జరుగుతుందని నమ్ముతూ ఉంటారు అక్కడ ప్రజలు. చీరలు కట్టుకొని ఆభరణాలు ధరించుకుని చక్కగా అలంకరించుకొని అమ్మాయి మాదిరి గానే రెడీ అవుతారు. ఇక తరతరాల నుంచి ఈ ఆచారం కొనసాగుతూ వస్తుందని గ్రామస్తులు చెబుతున్నారు. గ్రామం సుభిక్షం గా ఉండి పంటలు బాగా పండి అందరూ సుఖ సంతోషాలతో వెలగాలని ఉద్దేశంతో ఇక ఇలాంటి ఆచారాన్ని ప్రతి ఏటా కొనసాగిస్తున్నామని చెప్పుకొచ్చారు.