1. ఒక రోజు సమయం లో నీకోసం కనీసం 60 నిముషాలు కేటాయించుకో !
2. నీ ఒత్తిడి ని గమనించుకో ఎప్పుడు ఉద్రేకం నుండి బయట పడాలో ? శాంతం వహించాలో గమనించుకో !
3. ప్రతి రోజూ చేసి వ్యాయామం నీ ఒత్తిడి రసాయనాలను తగ్గించ గలదని గుర్తించుకో ! 
4. నీ ఆహారం లో పళ్ళూ , కాయగూరలూ , నీరూ తగినంతగా ఉండేలా చూసుకో !
5. కక్ష కన్నా క్షమ గొప్పది అని తెలుసుకొని పాటించడం అలవాటు చేసుకో !

stress management కోసం చిత్ర ఫలితం

6. ఒక విషయం గురించి నేను ఎంత ఆలోచించాలి అనేది నిర్ణయించుకో !
7. నవ్వు , దగ్గరకు తీసుకో , ఇతరులతో నీ భావాలు పంచుకో!
8. నువ్వు దేనికి ఒత్తిడికి గురి అవుతున్నావో గమనించుకుని రెండో సారి దానికే మళ్ళీ గురికాకుండా ఉండడం సాధన చెయ్యి
9. నిన్ను నీవు సరిగా అంచనా వేసుకో ! చేరలేని గమ్యాలను నిర్దారించుకోకు ! 
10. పాజిటివ్ గా ఆలోచించు . నీ బాహ్యస్వరూపం బట్టి నిన్ను ఇతరులు అంచనా వేస్తారు . అందువలన నీ బాహ్యస్వరూపం విషయం లో జాగ్రత్త వహించు

stress management కోసం చిత్ర ఫలితం


11. మద్యానికి , మాదక ద్రవ్యాలకీ దూరంగా ఉండు .

12. డబ్బు విషయం లో జాగ్రత్త వహించు . కనీసం 10 శాతం పొదుపు చెయ్యి
13. ఒద్దు , లేదు అనే మాటలను చెప్పడం నేర్చుకో ! 
14. బయటకు వెళ్ళు . మిత్రులతో , బంధువులతో గడపడం, విహార యాత్రలకు వెళ్ళడం నీకు ఒత్తిడి తగ్గిస్తుంది అని తెలుసుకో !
15. టి వి కన్నా నీకు ఇష్టమైన సంగీతం ఒత్తిడి తగ్గిస్తుంది అని గ్రహించుకో ! 

stress management కోసం చిత్ర ఫలితం

16.పొగ తాగడం ఒత్తిడి పెంచడమే కాదు నిన్ను చంపగలదు అని తెలుసుకో !

17. బంధాలను పెంచుకో , కాపాడుకో , ఎక్కువ విను , తక్కువ మాటాడు
18. బాగా నిద్రపో ! మంచి పక్క , దిండూ ఏర్పాటు చేసుకో ! గాలీ ధారాళంగా వచ్చేలా చూసుకో ! 
19. వారానికి ఒక్కసారి మస్సాజ్ చేసుకో ( తలంటి స్నానం చెయ్యి ) సినిమాకో , హోటల్ కో వెళ్ళు . రిలాక్స్ అవ్వడం నేర్చుకో ! 
20. విషయాలను నీ కోణం నుండి కాకుడా ఎదుటి వారి కోణం నుండి ఆలోచించడం నేర్చుకో !

stress management కోసం చిత్ర ఫలితం
21. విషయం పూర్తిగా తెలుసుకొని అప్పుడు బదులు ఇవ్వడం నేర్చుకో !
22. నీ ఆందోళన వలన సమస్యలు త్వందరగా గానీ , మంచిగా కానీ పూర్తి కావు అని గుర్తించుకో !
23. వచ్చే సంవత్సరానికి ఏమి సాధించాలి అనేది పక్కా ప్రణాళిక వేసుకో !
24. ప్రతీ రోజూ భగవానుడు నీకు ఇచ్చిన ఒక బహుమతి అని తెలుసుకొని . నవ్వుతూ ఉండు . ఈ ప్రపంచం అనే అందమైన పెయింటింగ్ లో నువ్వూ ఒక భాగం అని తెలుసుకో ! 
25. యోగా చెయ్యి . ప్రాణాయామం చెయ్యి . భగవంతునికి కృతజ్ఞతలు చెప్పు.




మరింత సమాచారం తెలుసుకోండి: