దేశం కోసం సేవలు చేసినా,  దేశం కోసం ప్రాణాలు అర్పించిన వ్యక్తులను మనం గౌరవించాలి. అలాంటి వారికి మనం ఇవ్వగలింది అంతకంటే ఏముంది. ఇకపోతే తమను తాము సేవకే అంకితం చేసుకుని, చివరివరకు ఆ సేవకోసమే బ్రతికేవారిని చూస్తే తప్పక ఆశ్చర్యమేస్తుంది. అలాంటి వారు అతి తక్కువగా పుడతారు కూడా. కాని నిరంతర సేవగుణం కలిగి, ఎనలేని కృషిచేసిన వారిలో కొందరికి ప్రభుత్వం ప్రకటించిన నోబెల్ బహుమతి ఒకే రాష్ట్రంలో ఉన్న వ్యక్తులకు దక్కడం మాత్రం నిజంగా అబ్బురపరిచే విషయం. మనదేశంలో ఇన్ని రాష్ట్రాలుండగా ఎక్కువగా బెంగాళీయులకు మాత్రమే ఈ బహుమతి దక్కింది.


ఎందుకనగా బెంగాలీలలో నరనరాన స్వాతంత్ర కాంక్ష.. పోరాటం.. పట్టుదల.. ధైర్యం కనిపిస్తుందట. అదీగాక ఇక్కడ స్వాతంత్ర కాంక్ష రగిలించే ఎంతో మంది నాయకులు పుట్టుకొచ్చారట. అందుకే ఈ రాష్ట్రాన్ని స్వాతంత్ర సంగ్రామంలో ఉద్యమానికి ఊపిరిపోసిన పురిటిగడ్డగా చెబుతారు. ఇకపోతే భారత స్వాతంత్ర అతివాద వీరుడు సుభాష్ చంద్రబోస్ పుట్టింది కూడా నాడు బెంగాల్ ఆధీనంలో ఉన్న కటక్ లోనే.. మన భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ గంగూలీ నుంచి నేటి బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వరకూ అంతా బెంగాల్ టైగర్లుగా దూకుడు కలిగిన వారుగానే ఉన్నారు. ఇక బెంగాలీ రక్తంలోనే ఆ తపన కాంక్ష ఉందని చెబుతారు.. అందుకే భారత దేశానికి ఆరు నోబెల్ బహుమతులు వస్తే ఆ ఆరు కూడా బెంగాల్ వ్యక్తులకే రావడం విశేషం. ఇకపోతే నోబెల్ బహుమతులు ఎవరెవరికి ఎప్పుడొచ్చాయో తెలుసుకుందాం..


మొట్టమొదటి నోబెల్ బహుమతి కోల్ కతాలో పరిశోధన చేసిన బ్రిటీష్ డాక్టర్ అయిన రోనాల్డ్ రాస్ కు ఇండియా దేశం తరుఫున 1902లో వచ్చింది. మలేరియాపై రాస్ జరిపిన పరిశోధనతో ఆ రోగం అంతుచిక్కింది. దోమలతో వస్తుందని తేలింది. కొల్‌కతా లోని ప్రెసిడెన్సీ ఆస్పత్రిలో పనిచేసిన రోనాల్డ్ రాస్ పేరు ఇప్పటికీ అక్కడ కనిపిస్తుంటుంది...

ఇకపోతే విశ్వకవిగా.. భారత జాతీయ గేయ సృష్టికర్తగా రవీంద్రనాథ్ ఠాగూర్ పేరు చిరస్మరణీయం.. ఈయన చేసిన నవలలు, గేయాలు, రచనలు, ప్రజల్లో స్వాంతంత్ర కాంక్షను రగిల్చాయి. 1913లో సాహిత్యంలో ఠాగూర్ కు నోబెల్ బహుమతి వచ్చింది. శాంతినికేతన్ స్థాపించి బెంగాలీ సాహిత్యాన్ని విశ్వవ్యాప్తం చేశాడు.


భారత భౌతిక శాస్త్ర పితామహుడిగా సీవీరామన్ పేరు దేశ చరిత్రలో నిలిచిపోయింది. 1930లో భౌతికశాస్త్రంలో ఈయన పరిశోధనలకు నోబెల్ దక్కింది. కొల్‌కతా యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా ఈయన చేసిన సేవలకు ఈ అవార్డ్ దక్కింది. స్వతహాగా ఈయనది మద్రాస్ రాష్ట్రమైనా  కొల్‌కతాలో  సెటిల్ అయ్యారు.

ప్రపంచంలోనే శాంతి కోసం ఎనలేని  కృషి చేసిన మదర్ థెరిసాకు 1979లో నోబెల్ వరించింది. అల్బేనియా దేశానికి చెందిన ఈమె 1929లో భారత్ కు వచ్చి కొల్‌కతాలో  చారిటీ మిషనరీస్ ఏర్పాటు చేసి పేదల ఆకలి బాధలు తీర్చి ప్రేమను పంచారు.


ఆర్థికవేత్తగా అమర్త్యసేన్ భారత ఆర్థికరంగంలో చెరగని ముద్ర వేశారు. ఈయన వెల్ ఫేర్ ఎకనామిక్స్ లో చేసిన కృషికి 1998 లో నోబెల్ బహుమతి వచ్చింది. భారత ఆర్థిక విధానాలపై  ఎన్నో పరిశోధనలు చేసిన. ఈయన ఠాగూర్ స్థాపించిన శాంతినికేతన్ కొల్‌కతాలో పుట్టడం విశేషం.

2019 సంవత్సరానికి గాను నోబెల్ బహుమతి పొందిన ఆర్థిక వేత్త అభిజిత్ ముఖర్జీదీ కూడా కొల్‌కతా కావడం గమనార్హం. ఇక ఈయన భార్య ఎస్తేర్ కూడా ఆర్థిక శాస్త్రంలో పరిశోధనలకు ఈ అవార్డ్ పొందారు. ఇంతే కాకుండా ఈ దంపతులు భారత ఆర్థిక విధానాలపై  పరిశోధనలు చేశారు...


మరింత సమాచారం తెలుసుకోండి: