ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు అంటారు పెద్దలు.. ఉల్లి మాత్రమే కాదు.. వెల్లుల్లి వల్ల కూడా అనేక ఉప‌యోగాలు ఉన్నాయి. మనం నిత్యం అనేక రకాల వంటకాల్లో 'వెల్లుల్లి'ని ఎక్కువగా ఉపయోగిస్తుంటాం. ఇది ఆహార పదార్థాలకు చక్కని రుచిని ఇస్తుంది, దీంతోపాటు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. వాస్త‌వానికి వెల్లుల్లి ఆరోగ్యానికి చేసే మేలు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అయితే సాధార‌ణ వెల్లుల్లి క‌న్నా మొల‌కెత్తిన వెల్లుల్లిపాయ‌ల్లోనే చాలా పోష‌కాలు ఉంటాయ‌ట‌. ప‌లువురు సైంటిస్టులు చేసిన ప‌రిశోధ‌నలో ఈ విషయం వెల్ల‌డైంది.

 

మొల‌కెత్తిన వెల్లుల్లిపాయ‌ల్లో సాధార‌ణం క‌న్నా ఓ మోస్త‌రు ఎక్కువ‌గానే యాంటీ యాక్సిడెంట్లు ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లు పుష్క‌లంగా ఉన్న కార‌ణంగా వ‌య‌స్సు మీద ప‌డ‌డం వ‌ల్ల వ‌చ్చే ముడ‌త‌లు పోతాయి. దీంతో చ‌ర్మం య‌వ్వ‌నంగా, కాంతివంతంగా మారుతుంది. యాంటీ ఆక్సిడెంట్లు పుష్క‌లంగా ఉన్న కార‌ణంగా వ‌య‌స్సు మీద ప‌డ‌డం వ‌ల్ల వ‌చ్చే ముడ‌త‌లు పోతాయి. దీంతో చ‌ర్మం య‌వ్వ‌నంగా, కాంతివంతంగా మారుతుంది. విటమిన్ సీ వెల్లుల్లిలో ఎక్కువగా ఉంటుంది. 

 

దీంతో నోటికి సంబంధించిన వ్యాధులన్నీ కూడా తగ్గిపోతాయి. అంతేకాదు మొల‌కెత్తిన వెల్లుల్లిని రోజూ తీసుకుంటే ఫ్యాట్ కూడా తగ్గిపోతుంది. స్లిమ్ గా మారిపోతారు.  మొల‌కెత్తిన వెల్లుల్లిపాయ‌ల్ని తింటే రక్త నాళాల్లో పేరుకుపోయిన కొవ్వు క‌రిగిపోతుంది. చెడు కొలెస్ట్రాల్ పోయి మంచి కొలెస్ట్రాల్ వృద్ధి చెందుతుంది. ర‌క్త స‌ర‌ఫ‌రా మెరుగు ప‌డి గుండె జ‌బ్బులు రాకుండా ఉంటాయి. మ‌రియు జీర్ణకోశ వ్యాధులకు వెల్లుల్లి చక్కటి ఔషదంగా ఉపయోగపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: