అంతరిక్షంలోకి రాకెట్లను పంపుతున్నా..ఇంకా మన సమాజంలోని కొన్ని వర్గాలు మాత్రం చీకటిలోనే ఉన్నాయి. కాదు కాదు.. వాటిని మన సమాజం ఇంకా చీకటిలోనే ఉంచుతోంది. అలాంటి చీకటి ఆచారాల్లో జోగిని ఒకటి. నాగరిక సమాజాన్ని కూడా పట్టి పీడిస్తున్న దురాచారం జోగిని.

 

 

 

ఇప్పుడు దీన్ని నేరంగా పరిగణిస్తున్నా తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని జిల్లాల్లో ఇంకా కొనసాగుతూనే ఉంది. తెలంగాణలోని మహబూబ్‌నగర్, నిజామాబాద్‌ వంటి చోట్ల ఇంకా ఈ అనాచారం కొనసాగుతూనే ఉంది. వాస్తవానికి ఈ సాంఘిక నేరానికి అసలైన కారణం పేదరికం, సాంఘిక చిన్నచూపే.

 

 

అసలేంటీ ఆచారం.. ఒక్కసారి పరిశీలిస్తే.. వయసొచ్చిన ఆడపిల్లను దేవుడికి అంకితం చేస్తుంటారు కొందరు. ఆ పేరుతో ఆమెను లైసెన్స్‌డ్‌ వేశ్యగా మార్చేస్తారు. పల్లెల్లో ఈ జోగిని దురాచారం బారిన పడి చాలామంది ఆడపిల్లల జీవితాలు నాశనమవుతన్నాయి. దీన్ని రూపుమాపడానికి ప్రభుత్వాలు చట్టాలు తెచ్చినా ఈ దురాచారం మాత్రం ఇంకా ఇంకా కొనసాగుతూనే ఉంది. గతంతో పోలిస్తే ఇప్పుడు కాస్త ఈ దురాచారం తగ్గుముఖం పట్టినా పూర్తిగా సమసిపోలేదు. అయితే పల్లెటూళ్లలోని సాంఘిక అసమానతలు ఈ ఆచారాన్ని ఇంకా బతికిస్తున్నాయి. పొరబపాటున జోగిని మారిన వాళ్లు మాత్రం.. ఇక వివాహాలు కాక.. వేరే బతుకు తెరువులేక వేశ్యావృత్తిలో చిక్కుకుపోతున్నారు. కొన్ని ఎన్జీవోలు ఈ సమస్యపై పోరాడుతున్నా.. ఇంకా చేయాల్సింది ఎంతో ఉంది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: