మన జీవితాలు ఎందుకు దుఃఖమయం అవుతున్నాయి.. ఒక్కసారి ఆలోచించారా.. మీకు మూడు పూటలా తినడానికి ఆహారం ఉండొచ్చు. ఉండటానికి ఓ ఇల్లు ఉండొచ్చు. బతకడానికి ఓ ఉద్యోగం ఉండొచ్చు. భార్య, పిల్లలు, తల్లిదండ్రులు ఉండొచ్చు. మనలో చాలా మందికి ఇవన్నీ ఉన్నా కూడా సంతోషం మాత్రం కనిపించదు. ఎందుకు.. ఈ ప్రశ్నకు కారణం వెదికారా.. వాస్తవం చెప్పాలంటే.. మనిషి  బ్రతకడానికి పెద్దగా ఖర్చు ఉండదు.  కానీ ! ఎప్పుడైతే ఎదుటి వారిలా  బ్రతకాలి అనుకుంటాడో అప్పుడే ఖర్చు అవుతుంది. మనిషి నరకప్రాయం చేస్తున్నది ఈ పోలికే. ఒకరితో మనం ఎప్పుడు పోల్చుకుంటామో అప్పుడు మనం జీవితంలో సంతృప్తి కోల్పోతున్నట్టు లెక్క. 

 


నీకు ఓ మంచి కారు ఉన్నా.. అంత కంటే మంచి కారు నీ పొరుగువాడికి ఉంటే.. ఆ కారు నీకు సంతృప్తి ఇవ్వదు. నువ్వు ఓ మంచి ఇంటిలో ఉంటున్నా.. నీ బంధువుల్లో ఒకడికి నీ కంటే మంచి ఇల్లు ఉంటే.. నీలో తృప్తి కనిపించదు. నీకు 5 కోట్ల ఆస్తి ఉన్నా.. పొరుగువాడికి 20 కోట్ల ఉంటే నీకు ఆ 5 కోట్లు చిత్తుకాగితాల్లానే  కనిపిస్తాయి. మాన‌వ జీవితంలో ప్ర‌తి మ‌నిషి ఇత‌రుల‌తో పోల్చుకుని నిజ‌మైన సంతోషాన్ని కోల్పోతున్నాడు. మ‌న క‌ళ్ల ముందు కోట్లాది రూపాయ‌ల ఆస్తి ఉన్నా కూడా మానసిక ప్ర‌శాంత‌త లేక నిత్యం గొడ‌వ‌లు ప‌డుతూ విడిపోతున్న కుటుంబాల‌ను, మ‌నుష్యుల‌ను, భార్య భ‌ర్త‌ల‌ను ఎంతో మందిని చూస్తున్నాం.

 

అదే స‌మ‌యంలో పేద గుడిసెల్లో ఉంటూ కూలి ప‌నులు చేసుకుని ఎంతో ప్ర‌శాంతంగా జీవితాన్ని అనుభ‌విస్తోన్న వారిని కూడా చూస్తున్నాం. అందుకే జీవితంలో సంతృప్తిగా బతకాలంటే పోల్చుకోవడం మానేయండి. నీకు ఉన్నది నీకు తృప్తిగా ఉందా లేదా అన్నదే ఆలోచించండి. మీకు తృప్తి లేకపోతే మరింత మెరుగైన స్థితికై ప్రయత్నించండి. పోలికకు మీరు స్వస్తి చెప్పినప్పుడే మీ జీవితంలో ప్రశాంతత.

మరింత సమాచారం తెలుసుకోండి: