జీవితంలో ఆనందం ఎప్పుడు లభిస్తుంది.. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం కష్టమే.. కానీ మనందరికీ అనుభవంలోకి వచ్చే ఆనంద మార్గం ఒకటి ఉంది. అదే పొందటం.. మనం ఏదైనా పొందినప్పుడు చాలా ఆనందిస్తారు.. మనం కొత్త వస్తువు కొంటే చాలా ఆనందిస్తాం. ఎవరైనా మనకు ఓ బహుమతి ఇస్తే చాలా ఆనందిస్తాం.. ఆ రోజంతా సంతోషంగా ఉంటాం.

 


అయితే మనకు అర్థం కాని విషయం.. మనలో చాలా మందికి అనుభవంలోకి వచ్చే ఓ విషయం ఉంది. అదే ఇవ్వడం.. అవును ఇవ్వడంలోనూ ఆనందం ఉంటుంది. ఏదైనా కష్టంలో ఉన్నవారికి సాయం చేస్తే మనస్సు అనిర్వచనీయమైన ఆనందం కలుగుతుంది. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. మనం ఎవరి వద్ద నుంచి ఏదైనా పొందిన దాంతో వచ్చే ఆనందం కంటే.. ఇదైనా ఇచ్చినప్పుడు పొందే ఆనందం చాలా ఎక్కువ. అంతే కాదు.. అది చాలా గొప్పది కూడా. 

 

IHG

 


వాస్తవానికి చిన్న విషయంలా కనిపించినా..ఇది చాలా గొప్ప విషయం. ఇతరులకు ఏ విధంగా నేను సహాయపడగలను అనే ఆలోచన మొదలైందంటే.. మీరు జీవితంలో చాలా ఎదిగినట్టు.. మీరు జన్మ సార్థకత దిశగా అడుగులు వేస్తున్నట్టు.. మనిషిగా మీరు ఉన్నత శిఖరాలు అధిరోహిస్తున్నట్టు. అందుకే గొప్ప గొప్ప ఆధ్యాత్మిక వేత్తలు.. ఇవ్వడంలోనే నాకు ఆనందం ఉంది... ఇతరులకు సహాయపడనప్పుడు నేను బతికి ఉండి ఏమి ప్రయోజనం? అనేవారు. 

 


మన పురాణాలు కూడా పరోపకారనికి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చాయి.  ‘లోకాస్సమస్తా స్సుఖినోభవంతు అంటూ పదే పదే ఘోషించాయి. మనిషి ఎప్పుడైనా సరే.. నా ఎదుగుదల ఇతరులకోసం అనే భావనతో ఉన్నత స్థితిని పొందుతాడు. అందుకే ఒక్కసారి ఇతరులకు సాయపడిచూడండి.. అది ఎంత చక్కటి అనుభూతి కలిగిస్తుందో..! 

మరింత సమాచారం తెలుసుకోండి: