ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలని అందరూ చూస్తుంటారు. ముఖ్యంగా కరోనా లాంటి మహమ్మారి నుంచి బయటపడటానికి రోగ నిరోధక శక్తిని ఎలా పెంచుకోవాలి అని ఆలోచిస్తుంటారు. సోషల్ మీడియా లో ఏవేవో వార్తలు వినిపిస్తాయి వాటిని ప్రయత్నించి ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు. అలాంటి వింత ప్రయోగాలు చేయకుండా కేవలం  వంటింట్లో దొరికే వాటితోనే ఆరోగ్యాన్ని పెంచుకోవచ్చునట.. అదెలానో అస్సలు ఆలస్యం చేయకుండా  చూద్దాం..

రోటి పచ్చళ్ళు..  వీటిని ఆనాతి కాలంలో ఎక్కువగా తీసుకుంటారు. అందుకే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. ముఖ్యంగా పుదీనా, కొత్తిమీర ను కలిపి చేసిన పచ్చడి వల్ల మంచి ఆరోగ్యం ఉందట.. అందుకు కావలసిన పదార్థాలు, తయారీవిధానం ఒకసారి చూసేద్దాం..

కావలసిన పదార్థాలు:

కొత్తిమీర: ఒక కప్పు
పుదీనా: అర కప్పు
అల్లం: చిన్న ముక్క
వెల్లుల్లి: మూడు రెబ్బలు
నల్ల ఉప్ప; రుచికి సరిపడా
జీలకర్ర.: అర స్పూన్

తయారీవిధానం :

ఆకులు మట్టిలో పెరుగుతాయి, వాటిమీద ఎన్నో పురుగు మందులు చల్లుతారు. తినేటప్పుడు వాటిని బాగా కడిగి తీసుకోవాలి. ఇక్కడ మనం తీసుకున్న ఆకులను నీటి తో బాగా కడగాలి. అందులో నల్ల ఉప్పు, పచ్చిమిర్చి, నల్ల ఉప్పు, అల్లం, వెల్లుల్లి వేసి రోట్లో మెత్తగా నూరాలి. ఈ పచ్చడికి పోపు పెట్టి పచ్చివాసన పొయ్యేవరకు వేయించాలి. అంతే ఎంతో రుచికరమైన రోటీ పచ్చడి రెడీ.. ఈ పచ్చడి వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఒకసారి చూద్దాం..

ఉదర సమస్యలు తొలగిపోతాయి.  డయాబెటిస్ సమస్యను నియంత్రిస్తుంది. కొత్తిమీర లో ఇన్సులిన్ స్థాయిని మెరుగుపరుస్తుంది. నోటి పూతను తగ్గించడం లో ఇది మంచి మెడిసిన్.. చూసారుగా తక్కువ సమయంలో  చేసుకొనే ఈ పచ్చడి వల్ల ఎన్ని  ప్రయోజనాలు ఉన్నాయో.. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు..  ఇప్పటినుంచి  మీరు కూడా ట్రై చెయ్యండి.. ఆరోగ్యాన్ని కాపాడుకోండి..

మరింత సమాచారం తెలుసుకోండి: