1. వ్యాయామం:
ప్రతి ఒక్కరికి వ్యాయామం..ఒత్తిడిని అధిగమించే ఒక బ్రహ్మాస్త్రం లాంటిది. వ్యాయామం చేయడం వల్ల మనం ఆరోగ్యంగా ఉండడమే కాకుండా మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. అలాగే మెదడు కూడా చురుకుగా పని చేస్తుంది. ఇక పిల్లలతో సమయం గడపడం, జంతువులతో కలసి తిరగడం, ఇలా శరీరాన్ని అటూ ఇటూ కదుపుతూ ఉండడం వల్ల శరీరంలోని అన్ని అవయవాలు సరిగా పని చేస్తాయి.
2. మంచి ఆహారం:
మనం తీసుకునే ఆహారం కూడా మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది అని చెబుతున్నారు వైద్యులు. ఎందుకంటే మనం తీసుకునే ప్రోటీన్స్ , విటమిన్స్ కలిగిన ఆహారం వలన మన శరీరంలో కొత్త ఉత్తేజం కలిగి , ఒత్తిడి దూరం అవుతుందట.
3. విశ్రాంతి తీసుకోవడం:
వీలైనంత వరకు మీరు చేస్తున్న.. ఏ పని అయినా సరే మధ్య మధ్యలో విశ్రాంతి తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. లేకపోతే నిద్రలేమి సమస్యతో పాటు ఎన్నో రకాల సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది.
4. ఇతరులతో స్నేహం చేయడం:
ఇతరులతో ఇంటరాక్ట్ అవ్వడం వల్ల మన ఆలోచనల్లో మార్పు కచ్చితంగా వస్తుంది.అంతే కాదు ప్రతి ఒక్క సారి ఇతరులను కలిసినప్పుడు ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవడానికి, మనం అలవాటు పడతాము. ఇక కొత్త విషయాలు నేర్చుకునే బాటలో పడ్డప్పుడు ఇతర విషయాలు గుర్తు రావు.. కాబట్టి ఒత్తిడిని దూరం చేసుకోవచ్చు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి