సాధారణంగా రోజురోజుకు ఉష్ణోగ్రత ఎక్కువ అవుతున్న నేపథ్యంలో ప్రజలు శరీరాన్ని చల్లగా ఉంచుకోవడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక అందులో భాగంగానే వేడి నుంచి ఉపశమనం పొందడానికి కూలర్,  ఏసీ ఫ్యాన్ వంటి వివిధ రకాల ఎలక్ట్రానిక్ వస్తువులను ఉపయోగించడమే కాకుండా శీతల పానీయాల సహాయం కూడా తీసుకుంటున్నారు. ముఖ్యంగా వీటి వల్ల లభించే ఉపశమనం కొంతకాలం మాత్రమే. శరీరాన్ని వేసవి కాలంలో చల్లగా ఉంచుకోవాలి  అంటే కొన్ని ఆహారాలను మనం రోజువారి డైట్ లో చేర్చుకోక తప్పదు. ఇక ఇవి శరీరాన్ని డీహైడ్రేట్ కాకుండా ఉండటంలో సహాయ పడతాయి. అలాగే ప్రతిరోజు తీసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన కూరగాయల గురించి కూడా ఇప్పుడు తెలుసుకుందాం.

కూరగాయలను మన రోజు వారి ఆహారంలో చేర్చుకోవడం వల్ల వేడి నుంచి ఉపశమనం పొందవచ్చు. అలాంటి వాటిలో ముఖ్యంగా టమోటా కూడా ఒకటి. టమోటా వల్ల శరీరాన్ని చల్లగా ఉంచకోవచ్చు. ఇందులో 95 శాతం వరకు నీరు పుష్కలంగా లభిస్తుంది. ఇది శరీరాన్ని డీహైడ్రేట్ కాకుండా ఉంచడమే కాకుండా ఇందులో ఉండే లైకోపిన్ కూడా  ఆరోగ్యానికి ప్రయోజనాలను చేకూరుస్తుంది. ఇక అత్యధిక పోషకాలు ఉండే పొట్లకాయ కూడా మీరు మీ ఆహారంలో ఒక భాగంగా చేసుకోవచ్చు . ఇది శరీరాన్ని చల్లగా ఉంచడమే కాకుండా హైడ్రేటెడ్ గా ఉంచటానికి సహాయపడుతుంది. అంతే కాదు పొట్లకాయ లో క్యాల్షియం లభించడం వల్ల ఎముకలు దృఢంగా మార్చుకోవచ్చు.

కీరదోసకాయలో కూడా 95 శాతం నీరు ఉంటుంది. ఇది శరీరాన్ని చల్లగా ఉంచడమే కాకుండా డీ హైడ్రేట్ కాకుండా కాపాడుతుంది. అంతేకాదు ఇందులో లభించే యాంటీ ఆక్సిడెంట్ తో పాటు  విటమిన్ సి,  విటమిన్ ఏ కారణంగా మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే మెంతి కూర,  బచ్చలికూర , పుదీనా , కొత్తిమీర,  ఉసిరి కాయ తోపాటు కాకరకాయలను కూడా ఈ వేసవి కాలంలో మన ఆహారంలో ఒక భాగంగా చేసుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: