ఒకప్పుడు ఎక్కడికి వెళ్లాలన్నా కేవలం నడక ద్వారా మాత్రమే వెళ్ళేవారు. కానీ ఇటీవల కాలం లో ద్విచక్ర వాహనాలు కార్లు అందుబాటు లోకి వచ్చిన నేపథ్యం లో నడవడానికి ఎవరూ అంతగా ఆసక్తి చూపడం లేదు. ఇలాంటి సమయం లో బరువు పెరిగి పోతారు. దీంతో బరువు తగ్గించు కోవడానికి వ్యాయామశాల కు వెళుతూ కసరత్తులు చేస్తున్నారు. అయితే ఇటీవలి కాలంలో అటు కనీసం ఇంటి మెట్లు ఎక్కడానికి కూడా ఎవరూ ఆసక్తి చూపడం లేదు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమం లోనే ప్రస్తుతం ఎక్కడ చూసినా లిఫ్టులు అందుబాటు లోకి వచ్చాయి.


 దీంతో మెట్లు ఎక్కాల్సిన పని లేకుండా పోయింది అని చెప్పాలి. పెద్దపెద్ద బిల్డింగులు సైతం ఎంతో అలవోకగా లిఫ్ట్ లో ఎక్కి ఒకచోట నిలబడితే చాలు నిమిషాల వ్యవధి లో వెళ్ళి పోవచ్చు. ఇలా శరీరం లో ఉన్న ఒక్క కేలరీ కూడా కరగకుం డానే ఇక వెళ్లాల్సిన చోటికి వెళ్లేందుకు ప్రస్తుతం లిస్టులో ఎంతగానో ఉపయోగ పడుతున్నాయ్ అని చెప్పాలి. అయితే ఇటీవలి కాలంలో లిఫ్టు లలో  ఎక్కువగా అద్దాలు కనబడుతూ ఉంటాయి. ఇక ఈ అద్దాలను చూసి చూడనట్లుగా వదిలేస్తూ ఉంటారు ఎంతోమంది.


 కానీ లిఫ్ట్ లలో ఇలా అద్దాలు ఎందుకు పెడతారు అన్నది మాత్రం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు అని చెప్పాలి. ఇంతకీ లిపులలో అద్దాలు ఎందుకు పెడతారో ఇప్పుడు తెలుసుకుందాం. సేఫ్టీ కోసం లిఫ్ట్ లో అద్దాలు పెడతారట. లిఫ్ట్ లో ఉన్నప్పుడు మనతోపాటు చాలామంది ఎక్కుతారు. ఇక మనం మిర్రర్ వైపు చూస్తూ అందరూ ఏం చేస్తున్నారు అనే విషయాన్ని గమనించవచ్చు. ఎవరైనా దొంగతనానికి పాల్పడుతున్నా.. ఇంకేదైనా అసాంఘిక కార్యకలాపాలు చేస్తున్న వెంటనే గమనించవచ్చట. ఈ క్రమంలోనే మొదటి సారి జపాన్ దేశంలో ఇలా లిఫ్టు అద్దాలు ప్రవేశపెట్టగా.. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఇదే ట్రెండ్ కొనసాగుతూ ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: