మెమరీ మేకర్స్ బ్యానర్ మీద హరికృష్ణ సోమిశెట్టి నిర్మించిన చిత్రం ‘ది రెడ్ బ్యాగ్’. ఈ మూవీకి రవి కుమార్ సీరపు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో కబీర్ సింగ్, ప్రసాద్ బెహరా, రాధ్య, మోనిక, ఆకాంక్ష, ఈషాన్ శంకర్, అవినాష్ బాదల్, భార్గవి, రాశీ తదితరులు ముఖ్య పాత్రలను పోషించారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పోస్టర్లు, గ్లింప్స్, టీజర్ అందరినీ ఆకట్టుకున్నాయి. మ్యూజికల్ ప్రమోషన్స్‌లో భాగంగా విడుదల చేసిన పాటలు యూట్యూబ్‌లో ట్రెండింగ్‌గా నిలిచాయి.

ఈ క్రమంలో విడుదల తేదీని టీం ప్రకటించింది. ఆగస్ట్ 21న ఈ సినిమాని భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు ముహూర్తం ఫిక్స్ చేశారు. ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాల్ని రిలీజ్ చేసి విజయాలు అందుకున్న పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ వారు ఈ ‘ది రెడ్ బ్యాగ్’‌ను రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున విడుదల చేయబోతోన్నారు. ఇప్పటికే సినిమాపై అందరిలోనూ అంచనాలు పెరిగాయి. మున్ముందు మరిన్ని ప్రమోషనల్ కంటెంట్‌తో హైప్‌ను పెంచనున్నారు.


‘ది రెడ్ బ్యాగ్’ చిత్రం విభిన్నమైన కథాంశంతో, యూత్‌ఫుల్ మరియు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కినట్లు ఇప్పటి వరకు వచ్చిన ప్రమోషనల్ స్టఫ్ స్పష్టం చేస్తోంది. నిర్మాణ విలువల పరంగా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా హరికృష్ణ సోమిశెట్టి ఈ చిత్రాన్ని మెమరీ మేకర్స్ బ్యానర్‌పై గ్రాండ్‌గా నిర్మించారు. ప్రియేష్ గురుస్వామి అందించిన విజువల్స్, శేఖర్ మోపురి నేపథ్య సంగీతం ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ఆగస్ట్ 21న పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక థియేటర్లలో విడుదలవుతున్న ఈ చిత్రం, బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తూ ప్రేక్షకులకు ఒక మంచి థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తుందని చిత్రబృందం ధీమా వ్యక్తం చేస్తోంది.



ఈ చిత్రానికి ప్రియేష్ గురుస్వామి కెమెరామెన్‌గా, శివ శర్వాణి ఎడిటర్‌గా, శేఖర్ మోపురి సంగీత దర్శకుడిగా పని చేశారు

 నటీనటులు : కబీర్ సింగ్, ప్రసాద్ బెహరా, రాధ్య, మోనిక, ఆకాంక్ష, ఈషాన్ శంకర్, అవినాష్ బాదల్, భార్గవి, రాశీ తదితరులు

 సాంకేతిక బృందం

బ్యానర్ : మెమరీ మేకర్స్
నిర్మాత : హరికృష్ణ సోమిశెట్టి
దర్శకుడు : రవికుమార్ సీరపు
మ్యూజిక్ : శేఖర్ మోపురి
డీఓపీ : ప్రియేష్ గురుస్వామి
ఎడిటింగ్ : శివ శర్వాణి
పీఆర్వో  : సాయి సతీష్

మరింత సమాచారం తెలుసుకోండి: