'అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్' బ్యానర్‌పై మాధవి రెడ్డి సోమ నిర్మించిన ఈ మూవీకి రమణా రెడ్డి సోమ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకి మనోహర్ రెడ్డి మంచురి సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రంలో MC హరి, మనోజ్, శశిధర్ ప్రధాన పాత్రల్లో నటించగా.. వేధా జలంధర్, రావణ్ నిట్టూరు, విశ్వేందర్ రెడ్డి, సాయోగి కీలక పాత్రలు పోషించారు. రానా దగ్గుబాటి సంస్థ 'స్పిరిట్ మీడియా' ఈ మూవీని తెలుగులో ఆగస్ట్ 21న గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోంది. ఈ క్రమంలో ప్రమోషన్స్‌లో భాగంగా ప్రధాన పాత్రధారులు MC హరి, మనోజ్, శశిధర్ చిత్ర విశేషాల్ని పంచుకున్నారు. వారు చెప్పిన సంగతులివే..

* ‘అమీర్ లోగ్’ ఎంతో నేచురల్‌గా ఉంటుంది. సినిమాని చూసినట్టుగా ఉండదు. హైదరబాద్ బస్తీలోకి వెళ్లినట్టుగా, ఆ బస్తీల్లో జీవిస్తున్నట్టుగా అనిపిస్తుంది. మా డైరెక్టర్ గారి అత్తగారి ఇల్లు, ఆ బస్తీలోనే షూటింగ్ చేశాం. అక్కడి వాళ్లంతా మా అందరినీ ఎంతో కేరింగ్‌గా చూసుకున్నారు.

* సింక్ సౌండ్‌లో ఈ మూవీని చేశాం. అందుకే ఏ చిన్న డిస్టర్బెన్స్ వచ్చినా షూటింగ్ ఆపేవాళ్లం. పైనా విమానం వెళ్లినా, ఏసీ సౌండ్ వచ్చినా కూడా ఆపేవాళ్లం. రోడ్ల మీద తీసిన సీన్లకు మాత్రమే డబ్బింగ్ చెప్పాం. అది కూడా దాదాపు ఐదు శాతం మాత్రమే ఉంటుంది.

* మేం బస్తీల్లోనే పెరిగాం. తెలంగాణ యాస, బస్తీ లైఫ్ కథ అవ్వడంతో మాకు చాలా సులభంగా మారింది. మా పాత్రలు రియల్ లైఫ్ కారెక్టర్స్‌కి దగ్గరగా అనిపించాయి. రమణ అన్న ఎంతో నేచురల్‌గా, ఎంతో సింపుల్‌గా సినిమాని తీశారు.

* ‘అమీర్ లోగ్’ చిత్రంలో బిర్యానీ అనేదే మెయిన్ పాయింట్. ఆ బిర్యానీ చుట్టూనే మా పాత్రలు తిరుగుతాయి. అది ఏంటి అన్నది సినిమా చూస్తేనే తెలుస్తుంది. ఫస్ట్ హాఫ్‌ని చూస్తే బిర్యానీ వాసన వస్తుంది. సెకండాఫ్‌లో బిర్యానీ టేస్ట్ తెలుస్తుంది. క్లైమాక్స్‌కి కడుపు నిండినట్టు అనిపిస్తుంది.

* షూటింగ్‌లోనే ఓ క్లౌడ్ కిచెన్ ప్రారంభించాం. అక్కడ వండిన వంటలే అందరం తిన్నాం. మాకు సీన్స్ లేకపోతే కిచెన్‌కి వెళ్లి పని చేసేవాళ్లం. మాకు వంట వండటం కూడా అలవాటు అయింది.

* తెరపై మేం ముగ్గురం ఎక్కువగా కనిపించినా.. మా సినిమాలో మహిళా పాత్రలే కీలకంగా ఉంటాయి. అమ్మానాన్నలు, అక్క, అన్న, వదిన, పక్కింటి పాత్రలు ఇలా అన్ని కూడా సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా ఉంటుంది. ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా, అందరికీ రిలేట్ అయ్యేలా ఉంటుంది. మా సినిమా అంతా కూడీ ఫీమేల్ సెంట్రిక్‌గా ఉంటుంది.

* ‘అమీర్ లోగ్’ అవుట్ పుట్ చూశారు కాబట్టే మా దర్శకుడు రమణన్న గారు అంత కూల్‌గా ఉంటున్నారు. అనుకున్నది అనుకున్నట్టుగా తీయగలిగారు. సినిమా చూశాక మా అందరికీ ఎంతో కాన్ఫిడెంట్ వచ్చింది. మంచి ప్రొడక్ట్ మా చేతుల్లో ఉంది. దాన్ని ఇలా ప్రమోట్ చేసుకుంటున్నాం.

* రానా గారి టీం మా సినిమాని చూసింది. హైదరాబాద్‌లో ముందు ఫోకస్ పెట్టండి. ఆ తర్వాత అన్ని ఏరియాల్లో కవర్ చేయండని రానా గారు చెప్పారు. త్వరలోనే ఆయన కూడా సినిమాని చూస్తారు.

* మా సినిమాలోని ఎమోషన్‌ను స్మరణ్ మ్యూజిక్ మరో స్థాయికి తీసుకు వెళ్లింది. ఆయన పాటలే ఈ చిత్రానికి ప్రాణం. ఆయన ఇచ్చిన మ్యూజిక్, ఆర్ఆర్‌తో సినిమా నెక్ట్స్ లెవెల్‌కి వెళ్లింది.

* రెగ్యులర్ తెలుగు సినిమాల్లో ఉండేలా కాకుండా ఇందులో హిందీ ఎక్కువగా ఉంటుంది. తెలంగాణ, హైదరాబాద్ అంటే తెలీకుండానే కొన్ని పదాల్లో హిందీ, ఉర్దూ వచ్చేస్తుంది. మరీ హై లెవెల్లో కాకుండా సాధారణ జనాలకు అర్థమయ్యేలానే భాషను వాడాం. ఇక్కడి భాషకి, యాసకి అడ్రెస్‌లా మా ‘అమీర్ లోగ్’ సినిమా ఉంటుంది. భాష, యాసతో సంబంధం లేకుండా ఎమోషన్స్‌తో తీసిన ఈ చిత్రం అందరికీ కనెక్ట్ అవుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: