మన శరీరం ఒక సంక్లిష్టమైన నిర్మాణం..ఎన్నో అనువుల తో కూడిన గూడు. ఓ కనిజాలకు నిధి. శరీరం గురించి మనకు తెలిసిన దానికంటే ఇంకా తెలుసుకోవలసినవి చాలా ఉన్నాయి.శరీరానికి సంబంధించి ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. మానవ శరీరంలో మనకి తెలియని ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. వాటి గురించే తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవల్సిందే. మనిషి శరీరంలో ఇనుము మాత్రమే కాదు బంగారం కూడా ఉంటుంది. మీకు ఈ సమాచారం వింతగా లేదా ఆశ్చర్యంగా అనిపించవచ్చు కానీ ఇది నిజం. మన శరీరం గురించి మనకు తెలియని కొన్నిఆసక్తికరమైన విషయాలతోపాటు బంగారం గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం…


మన శరీరంలో కూడా కొంత బంగారం ఉంటుంది.దాని పరిమాణం చాలా తక్కువగా ఉంటుంది. దాదాపు 0.2 మి.గ్రా. శరీరంలో లభించే బంగారం చాలా వరకు రక్తం లో కరిగిపోతుంది. మనిషి శరీరంలో నే కాకుండా ఆవు మూత్రం లో కూడా బంగారం ఉంటుంది. ఇక్కడ కూడా పరిమాణం చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి దీనిని మనం బంగారంగా మార్చు కోలేము..అలాగే దీనిని ఉపయోగించలేము..


శరీరంలో ఖనిజాలు తో పాటు స్థూల ఖనిజ లవణాలు అంటే కాల్షియం, ఫాస్పరస్, మెగ్నీషియం, క్లోరిన్, సల్ఫర్, పొటాషియం, సోడియంలు. ఇవి మన శరీరం లో 0.05% ఉంటాయి. ఇక సూక్ష్మఖనిజ లవణాలు మన శరీరం లో 0.05% కంటే తక్కువగా ఉండే ఖనిజ లవణాలను సూక్ష్మఖనిజ లవణాలు అని అంటారు. వీటినే ట్రేస్ ఎలిమెంట్స్ అని కూడా అంటారు. ఐరన్, అయొడిన్, జింక్, కాపర్, ఫ్లోరిన్, సెలీనియం, క్రోమియం, మాంగనీస్, కోబాల్ట్, మాలిబ్డినం లను సూక్ష్మఖనిజలవణాలు అని అంటారు.ఇవన్నీ కూడా మన శరీరంలో వుంటాయి.. వీటిలో ఒక్కటి తగ్గినా కూడా ఏదొక విధమైన ఆరోగ్య సమస్యలు వస్తాయి..అందుకే పోషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకోవడం మంచిది

మరింత సమాచారం తెలుసుకోండి: