మధుమేహం రోగులకు ఇది చక్కటి వరం?


అనారోగ్యకరమైన జీవనశైలి, రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరిగినప్పుడు మధుమేహం సంభవిస్తుంది. మధుమేహాన్ని పూర్తిగా నయం చేయలేమని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 422 మిలియన్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారు. ఈ వ్యాధి కారణంగా ప్రతి సంవత్సరం సుమారు 1.5 మిలియన్ మరణాలు సంభవిస్తున్నాయి.అందువల్ల, మన శరీరంలోని రక్తంలో చక్కెర స్థాయిని నిర్వహించడం చాలా ముఖ్యం. ఆరోగ్యకరమైన జీవనశైలి మన రక్తంలో చక్కెరను చెక్ చేయడానికి, అదుపులో ఉంచడానికి మంచి మార్గంగా పేర్కొంటున్నారు.హెల్తీ లైఫ్ స్టైల్ ని మెయింటైన్ చెయ్యడంలో ఆహారం ప్రధాన పాత్ర పోషిస్తుంది. మన వంటగదిలో సాధారణంగా అందుబాటులో ఉండే అనేక రకాల ఆహార పదార్థాలు ఎంతో మేలు చేస్తాయి. ఇవి మధుమేహాన్ని నిర్వహించడానికి అవసరమైన పోషకాలను మీకు అందిస్తుంది. అలాటి ముఖ్యమైన ఆహార పదార్ధాలలో ఉల్లిపాయ ఒకటి.శాన్ డియాగోలో జరిగిన ఎండోక్రైన్ సొసైటీ 97వ వార్షిక సమావేశంలో సమర్పించిన అధ్యయనంలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. రక్తంలో చక్కెర స్థాయిలను 50 శాతం తగ్గించడంలో సహాయపడే లక్షణాలు ఉల్లిపాయలో ఎక్కువగా ఉన్నాయని కనుగొన్నారు. 


అంతే కాదు. కొలెస్ట్రాల్‌ను నిర్వహించడానికి ఇది గొప్పదని కూడా నిరూపితమైంది. పరిశోధకుల అభిప్రాయం ప్రకారం..ఉల్లిపాయ బల్బ్, అల్లియం సెపా, యాంటీడయాబెటిక్ డ్రగ్ మెట్‌ఫార్మిన్‌తో ఇచ్చినప్పుడు డయాబెటిక్ ఎలుకలలో.. రక్తంలో అధిక గ్లూకోజ్ (చక్కెర), మొత్తం కొలెస్ట్రాల్ స్థాయిలను బాగా తగ్గించింది.ఉల్లిపాయలు రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా తగ్గించడంతోపాటు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతున్నట్లు కనుగొన్నారు. ఉల్లిపాయలో కేలరీలు ఎక్కువగా ఉండవు. అయినప్పటికీ, ఇది జీవక్రియ రేటును పెంచుతుంది. దానితోపాటు ఆకలిని పెంచడం, దాణా పెరుగుదలకు దారితీసిందని తెలిపారు.ఆరోగ్యకరమైన జీవనశైలిని కొనసాగించడానికి మీ రోజువారీ ఆహారంలో ఉల్లిపాయను ఖచ్చితంగా చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే, ఏదైనా జీవనశైలి మార్పునకు అనుగుణంగా ఉండే ముందు ఎల్లప్పుడూ ఆరోగ్య నిపుణులను సంప్రదించాలని పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: