భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ మొదటి విమానం ల్యాండ్ అయింది. టెస్ట్ ఫ్లైట్ ఢిల్లీ నుంచి భోగాపురం వచ్చింది. ఈ టెస్ట్ విజయవంతం అవడంతో త్వరలోనే ఈ ప్రాంతం నుంచి విమాన సర్వీసులు కూడా అందరికీ అందుబాటులోకి రానున్నాయి. ఈ విమానాశ్రయం అందుబాటులోకి వస్తే ఇక విశాఖపట్నం దక్షిణ భారతదేశంలోని ఒక ప్రధాన ఆర్థిక కేంద్రంగా మారుతుంది. వీటికి సంబంధించి పలు కీలకమైన అంశాలను కూడా ప్రస్తావించడమే కాకుండా , భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ రావడం వెనక తమ కృషిని కూడా వివరించారు జగన్.
విశాఖపట్నంలో కొత్తగా నిర్మించిన భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ మొదటి విమానం ల్యాండ్ కావడం ఆనందకరం ఏపీ అభివృద్ధి మార్గంలో ఒక మైలురాయి visionVizag లక్ష్యాన్ని సాధించే దిశగానే కీలకమైన అడుగు పడిందంటూ తెలిపారు.. వీటిని కొనసాగింపుగా ఈ ఎయిర్ పోర్ట్ నిర్మాణంలో అసాధారణ కృషిచేసిన GMR కు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. మా పాలనలో వేగవంతంగా అనుమతులు సాధించడమే కాకుండా ఎయిర్ పోర్ట్ నిర్మాణం కోసం భూములు ఇచ్చిన వారికి భూసేకరణ కోసం రూ .960 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఒక బలమైన పునాది వేసాము. ఈ ప్రాజెక్టుకు సంబంధించి కీలకమైన పనులు అప్పుడే పూర్తి అయ్యింది. ఆరోజు మేము చేసిన కృషి వల్లే ఈరోజు ఒక కీలకమైన మైలురాయిగా మారిందని తెలిపారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంతో అనుసంధానాన్ని భోగాపురం ఎయిర్ పోర్ట్ బైపాస్ జాతీయ రహదారిని కూడా 2023 మార్చిలో ఆమోదం తెలిపినందుకు నితిన్ గడ్కరీ గారి కృషి కూడా ఉందని ఆయన సహకారం ఉంది అంటూ ట్విట్ చేశారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి