ఊరు కానీ ఊరుకుపిల్లలను పంపించి బాగా చదువుకుంటున్నారు అని తల్లిదండ్రులను భావిస్తున్నారు. కానీ అక్కడ చదువుకుంటున్నారో.. ప్రేమ వ్యవహారం నడిపిస్తున్నారో తెలుసుకోలేక చివరకు దారుణాలు జరిగి తీవ్రంగా నష్టపోయిన తర్వాత కళ్లు తెరుస్తున్నారు. ఇటీవల తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్లలో జరిగిన దారుణ ఘటనే దీనికి ఉదాహరణ.


హైదరాబాద్ లో చదువుకునే సమయంలో లైఫ్ ఎంజాయ్ చేయాలని భావిస్తున్నారు. దీని కోసం అబ్బాయిలతో బైక్ లపై తిరుగుతున్నారు. అర్ధరాత్రిళ్లు షికార్లు చేస్తున్నారు. ఏమన్నా అంటే స్వేచ్ఛగా ఉండకూడదా అని చెబుతున్నారు. అయితే కోరుట్ల దీప్తి హత్య కేసులో సంచలన విషయాలు బయటకొచ్చాయి. చందన అనే అమ్మాయి ఉమర్ అనే అబ్బాయిని ప్రేమించింది. అతడితో లేచిపోవాలని అనుకుంది. అయితే ఇంట్లో తెలిస్తే సమస్య వస్తుందని భావించి సరైన సమయం కోసం వేచి చూసింది.


తల్లిదండ్రులు లేని సమయంలో ఆ అబ్బాయిని ఇంటికి రమ్మని పిలిచింది. ఇంట్లో తన సోదరి దీప్తి కూడా ఉంది. దీప్తి సాప్ట్ వేర్ ఇంజినీర్ గా జాబ్ చేస్తోంది. అక్క చెల్లెళ్లు ఇద్దరు కలిసి మందు తాగారు. మందు తాగిన మైకం లో ఉన్న దీప్తిని చూసి చందన తన బాయ్ ప్రెండ్ ను పిలిచింది. వెంటనే ఇంట్లోని బీరువాలో దీప్తి పెళ్లికి దాచిపెట్టిన 70 నుంచి 80 తులాల బంగారాన్ని ఎత్తుకెళ్లాలని చూస్తుండగా దీప్తికి మెలకువ వచ్చి అరవడంతో ఆమెను తన చున్నీతో గొంతుకు బిగించి, నోటికి ప్లాస్టర్ వేసి ఊపిరాడకుండా చేసి చంపేసింది.


ఇందులో దీప్తి చనిపోయిందని నిర్దారించుకున్న తర్వాత చందన తన బాయ్ ప్రెండ్ తో కోరుట్ల బస్టాండ్ నుంచి వెళ్లిపోయింది. చివరకు తమ్ముడు సాయి కి ఫోన్ చేసింది. నేనెందుకు చంపుతానురా సాయి అంటూ మాట్లాడింది. పోలీసులు వీరి ఫోన్లను ట్రాక్ చేసి చందన, తన బాయ్ ప్రెండ్ ను అదుపులోకి తీసుకున్నారు. వారి స్టైల్ లో విచారించడంతో నిజాలు బయటకువచ్చాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: