చాలామంది ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారని ఎన్నో సందర్భాలలో తెలియజేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఎవరైనా ఏదైనా చెబితే మర్చిపోవడం లేకపోతే ఏదైనా వస్తువు పెట్టిన చోట మర్చిపోవడం వంటివి చాలామంది చేస్తూ ఉంటారు. గత కొంతకాలంగా ఈ సమస్య చాలా మందిలో ఎక్కువగా కనిపిస్తోందని వైద్యులు సైతం తెలుపుతున్నారు. ఇది చాలా ఇబ్బంది సమస్యగా మారుతోందని సాధారణంగా మతిమరుపు అనేది వయసు పైబడిన వారికి వచ్చే ఒక సమస్యగా ఉంటుందని తెలుపుతున్నారు.


ముఖ్యంగా మెదడు పనితీరు మందగించడం వల్ల ఇలా జ్ఞాపకశక్తి తగ్గిపోవడం వంటి సమస్యలు వృద్ధాప్యంలో ఎక్కువగా కనిపిస్తాయి. 50 ఏళ్లు దాటాయంటే చాలు చాలా మతిమరుపు సమస్యలు ఎక్కువగా వస్తాయి. అయితే మరి కొంతమంది మాత్రం చిన్న వయసులో మతిమరుపు వస్తుంది అంటే మెదడు పనితీరు మెరుగుపరచడంలో ఎక్కడ లోపం జరిగిందని గమనించాలి.. మెదడు చురుగ్గా పనిచేయాలి అంటే ఆరోగ్యంగా ఉండాలి అన్న ఒమేగా-3 చాలా ముఖ్యము.. ఆహారంలో ఎక్కువగా చియా సీడ్స్, అవిసె గింజలు వంటివి తీసుకోవడం చాలా మంచిది. దీనివల్ల మెదడు పనితీరు చాలా చురుకుగా పనిచేస్తుంది.


చాలా రుచికంగా ఉండే బెర్రీ పండ్లను మెదడుకు మంచి టానిక్కుల పనిచేస్తుంది. బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, బ్లాక్ బెర్రీస్ వంటి పండ్ల ను తీసుకుంటే మెదడు పనితీరు మెరుగు అవుతుందట.


ఆకుకూరలు ఎలాంటివి తిన్నా సరే ఇందులో విటమిన్-k, లూటీన్ వంటివి పుష్కలంగా లభిస్తాయి. ఇవి మెదడు ఆరోగ్యానికి చురుకుగా పనిచేస్తాయి. ముఖ్యంగా బచ్చలి కూర, పాలకూర ,మెంతాకు తినడం వల్ల ఇందులో ఉండే ఖనిజాలు మెదడుకు పుష్కలంగా లభిస్తాయి.


బాదం ,వాల్నట్ ,చియా సీడ్స్ వంటివి తినడం వల్ల ఇందులో పుష్కలంగా విటమిన్-E లభిస్తుంది.. ఇది మెదడు దెబ్బ తినకుండా కాపాడడంలో చాలా సహాయపడుతుంది. వీటిని ప్రతి రోజు తింటే కచ్చితంగా మెదడు పనితీరు చురుకుగా పనిచేస్తుంది.


అలాగే తృణధాన్యాలు గుమ్మడికాయ విత్తనాలను తినడం వల్ల మరింత మంచిదట.

మరింత సమాచారం తెలుసుకోండి: