జొన్నలు ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల చాలా అనారోగ్య సమస్యల నుండి మనం బయటపడవచ్చు. చాలా మంది కూడా వీటిని పిండిగా, రవ్వగా చేసి వివిధ రకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటారు. ఎక్కువగా రొట్టె, అన్నం, ఇడ్లీ ఇంకా ఉప్మా వంటి వాటిని తయారు చేస్తూ ఉంటారు. ఇంకా ఇవే కాకుండా జొన్న పిండితో మనం అంబలి కూడా తయారు చేసుకోవచ్చు. ఈ జొన్న అంబలి చాలా రుచిగా ఉంటుంది. దీనిని తీసుకోవడం వల్ల మన శరీరానికి చాలా మేలు కలుగుతుంది. ఇక ఈ అంబలిని ఎవరైనా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు.ఇక జొన్న అంబలిని రుచిగా ఎలా తయారు చేసుకోవాలి.. ఇంకా అలాగే దీనిని తీసుకోవడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.


దీని కోసం ఒక గిన్నెలో ఒక కప్పు జొన్న పిండిని వేయాలి.ఆ తరువాత 3 గ్లాసుల నీళ్లు పోసి బాగా కలపాలి. ఇందులోనే తగినంత సైంధవ లవణం వేసి కూడా కలపాలి. ఇక ఈ గిన్నెను స్టవ్ మీద ఉంచి కలుపుతూ ఉడికించాలి. దీనిని 5 నుండి 6 నిమిషాల పాటు కలుపుతూ ఉడికించి స్టవ్ ని ఆఫ్ చేసుకోవాలి. ఆ తరువాత దీనిని గ్లాస్ లో పోసి అందులో కొద్దిగా మిరియాల పొడి, నిమ్మరసం కలిపి తీసుకోవాలి.ఇలా చేయడం వల్ల  రుచిగా ఉండే జొన్న అంబలి ఈజీగా తయారవుతుంది. ఈ అంబలి తాగడం వల్ల మన శరీరానికి కావల్సిన శక్తి లభిస్తుంది.రోజంతా చాలా ఉత్సాహాంగా పని చేసుకోవచ్చు. బరువు తగ్గాలనుకునే వారు ఈ అంబలిని తాగడం వల్ల ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది. జొన్న అంబలిని తీసుకోవడం వల్లశరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా తగ్గుతాయి. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ అంబలిని తీసుకోవడం వల్ల జీర్ణశక్తి బాగా మెరుగుపడుతుంది.


షుగర్ తో బాధపడే వారు ఈ అంబలిని తీసుకోవడం వల్ల ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది.ఈ అంబలిని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు ఈజీగా అదుపులో ఉంటాయి. ఇంకా అలాగే ఈ అంబలిని తీసుకోవడం వల్ల ఎముకలు ధృడంగా తయారవుతాయి.అలాగే ఎముకలకు సంబంధించిన సమస్యలు రాకుండా ఉంటాయి. దగ్గు, జలుబు, గొంతునొప్పి వంటి సమస్యలతో బాధపడే వారు ఈ అంబలిని తీసుకోవడం వల్ల ఖచ్చితంగా మంచి ఉపశమనం కలుగుతుంది. ఇక ఈ అంబలిని ఎవరైనా తీసుకోవచ్చు. ఇలా జొన్న పిండితో అంబలిని చేసి తీసుకోవడం వల్ల మనం రుచితో పాటు సంపూర్ణ ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: