చికెన్ ఇష్టపడే వాళ్ల కోసం ఇంట్లో ఈజీ గా చికెన్ పచ్చడి ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం.చికెన్ తో కర్రీ లేదా వేపుడు చేసుకుంటే ఒకరోజు లేదా రెండు రోజులు తింటాము. అదే చికెన్ తో పచ్చడి చేస్తే కనీసం పది పదిహేను రోజులు స్టోర్ చేసుకొని తినొచ్చు రుచి కూడా అదిరిపోతుంది.బయట మార్కెట్ లో కొనే నాన్వెజ్ పచ్చడ్లలో ఫుడ్ కలర్ ని యూస్ చేస్తారు.పచ్చడి పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండటానికి కొన్ని కెమికల్స్ వాడతారు.అంతే కాకుండా దానికి వాడే ఆయిల్ ఫ్రెష్ గా ఉండకపోవచ్చు.అయితే మనమే ఇంట్లోనే ఫ్రెష్ ఇంగ్రీడియన్స్ తో రుచికరమైన చికెన్ పికిల్ ని తయారుచేసుకుందాం.ముందుగా ఒక కేజీ బోనెల్స్ చికెన్ ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొవాలి.ఇప్పుడు డీఫ్రై కి సరిపడా ఆయిల్ వేసుకుని బాగా కాగానివ్వాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలని బాగా కడిగి వాటర్ మొత్తం వంపేసి ఆయిల్ లో వేసి బాగా డీఫ్రై చేసుకోవాలి.


మంచి కలర్ వచ్చేవరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత పచ్చడి కలుపుకోవటానికి ఈజీ గా ఫ్రీగా వుండే బౌల్ ని తీసుకొని అందులో ఫ్రై చేసుకున్న చికెన్ ముక్కలని వేసి, కేజీ చికెన్ కి పది నిమ్మకాయల రసం తీసి కలపాలి. ఇందులోనే హాఫ్ కప్పు ఆవపొడి,హాఫ్ కప్పు సాల్ట్,ఒక కప్పు కారం,ఒక స్పూన్ మెంతిపొడి, హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి. కొంచం పసుపు వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో ఆయిల్ వేసి స్పూన్ అవాలు,స్పూన్ జీలకర్ర, హాఫ్ స్పూన్ మెంతిపొడి, నాలుగు గడ్డలు వెల్లుల్లి పేస్ట్,ఒక చెంచా అల్లం పేస్ట్,గుప్పెడు కరివేపాకు,ఇవన్నీ వేసి మంచిగా పచ్చి వాసన పోయేవరకు రోస్ట్ చేసుకోవాలి.ఇలా రోస్ట్ చేసుకున్న తాలింపుని చల్లారాక చికెన్ ముక్కలో వేసుకోవాలి.రెండూ బాగా కలిసేలా కలిపికోవాలి.అంతే ఎంతో క్రిస్పీ గా స్పైసి గా ఘుమఘుమలాడే చికెన్ పచ్చడి రెడీ.ఇలా తయారు చేసికున్న పచ్చడి ఒక కంటైనర్ లో స్టోర్ చేసుకోవచ్చు.నెల రోజుల వరకు పాడవకుండా ఉంటుంది.వేడి వేడి రైస్ లో తింటుంటే చాలా బాగుంటుంది. పప్పు,పప్పుచారులో తింటుంటే అద్భుతంగా ఉంటుంది. మరి మీరు కూడా ట్రై చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: