వాస్తు ప్రకారం ప్రతి ఒక ఇంటికి వంటగది అనేది చాలా ముఖ్యము.. ఈ వంట గదని అన్నపూర్ణ దేవిగా భావిస్తూ ఉంటారు.. వంటగదికి సంబంధించిన అనేక నియమాలు వాస్తు శాస్త్రంలో తెలియజేయబడతాయి.. ఒకవేళ మీ వంట గదిలో వాస్తు నియమాలను జాగ్రత్తగా చూసుకున్నట్లు అయితే.. ఆ ఇంటిల్లిపాదికి ఆహార విషయంలో ధనలక్ష్మి కటాక్షం విషయంలో ఎలాంటి కొరత ఉండదు. అయితే మనం కొన్ని పాటించాల్సిన వాస్తు టిప్స్ గురించి ఒకసారి చూద్దాం..


ముఖ్యంగా ఆహారం వండడానికి ముందు తప్పనిసరిగా స్నానం చేసిన తర్వాత మనం దేవుడిని ప్రార్థించి వంట ప్రారంభించడం మంచిది.. వంటగది లో అన్నపూర్ణమ్మ దేవి ఫోటో కూడా ఉండడం వల్ల మరింత మంచిది. ఇలా చేయడం వల్ల ఆ ఇంటికి డబ్బు సమస్య, ధాన్యం  కొరత అసలు ఉండదట.


రాత్రి పూట వంట గదిలలో ఖాళీ పాత్రలను అసలు ఉంచకూడదు.. దీనివల్ల అన్నపూర్ణ దేవికి కోపం వస్తుందట. కనీసం ఒక ముద్ద ఆహారమైన సరే వంట పాత్రలలో ఉంచేలా చాలా జాగ్రత్తగా తీసుకోవాలి.


వంట గదిలో నీటిని, అగ్ని ఒకదానికొకటి దగ్గరగా అసలు ఉంచకూడదు.. వాస్తు శాస్త్రం ప్రకారం వీటిని ఆపోజిట్ డైరెక్షన్లో ఉంచాలట.


వంట చేసేటువంటి వంట గదిలో గ్యాస్ కచ్చితంగా ఆగ్నేయ దిశలో ఉంచేలా చూసుకోవాలి.. ముఖ్యంగా మనం ఆహారం తినేటప్పుడు ముఖం ఈశాన్య దిశంలో ఉండేలా చూసుకోవాలట..


వంట గదిని బెడ్ రూమ్ కి దగ్గరగా టాయిలెట్లకు దగ్గరగా అసలు ఉంచకూడదు.


వంటగది తలుపు కచ్చితంగా తూర్పు ఉత్తరం లేదా పడమర వైపుగా ఉంచేలా చూసుకోవాలి.


వంటగదికి రంగు వేసేటప్పుడు ఆకుపచ్చ రంగు మంచి రంగుగా పరిగణించబడిందట.. ఎందుకంటే ఆకలిని ఈ రంగు ప్రేరేపిస్తుందట.


వంట గదిలో స్టవ్వుకు, సింకుకు మధ్య కాస్త ఖాళీ వ్యత్యాసాన్ని ఉంచేలా చూసుకోవాలి.. ఇలాంటి వాస్తు టిప్స్ వంట గదికి ఉండేలా చూసుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: