కర్పూరం ప్రతి ఒక్కరీ ఇళ్లలో ఉపయోగిస్తూ ఉంటాము.. ఇంటిలో దేవుడు గదిలో వీటిని కచ్చితంగా ఉపయోగిస్తూ ఉంటారు.. ఎన్నో ఔషధ గుణాలకు కర్పూరం పెట్టింది పేరు..ముఖ్యంగా ఈ కర్పూరం లేనిది పూజ కూడా పూర్తి అవ్వదు.. అయితే కేవలం పూజలో మాత్రమే కాకుండా కర్పూరం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నవి.. మనం ప్రతిరోజు కర్పూర వాసనను పీల్చుకుంటే కలిగే ప్రయోజనాలను ఇప్పుడు ఒకసారి మన పూర్తిగా తెలుసుకుందాం..


మనం ప్రతిరోజు కర్పూరం వాసనను పీల్చుకున్నట్లు అయితే అధిక ఒత్తిడి ఆందోళన నుంచి మనం బయటపడవచ్చు.. అలాగే దగ్గు జలుబుతో ఇబ్బంది పడుతున్న వారు కర్పూరం వాసనను పీల్చుకోవడం వల్ల కాస్త ఉపశమనాన్ని కూడా పొందుకోవచ్చు. తీవ్రమైన తలనొప్పితో ఇబ్బంది పడేవారు కర్పూరం ఒక దివ్య ఔషధంగా ఉపయోగపడుతుంది.. కర్పూర వాసనను పీల్చడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలను కూడా తగ్గిస్తుందని నిపుణులు సైతం వెల్లడిస్తున్నారు.. ముఖ్యంగా తెల్ల కర్పూరం కంటే పచ్చ కర్పూరం కాస్త నీటిలో కలుపుకొని తాగడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని నిపుణులు సైతం తెలియజేస్తున్నారు.


దేవాలయంలో తీర్థాలలో కూడా ఎక్కువగా కర్పూరాన్ని కలుపుతూ ఉంటారు. ఇందులో ఉండే యాంటీబ్యాక్టీరియల్ యాంటీ ఫంగస్ లక్షణాలు వల్ల మనలో ఉండేటువంటి ప్రమాదకరమైన సూక్ష్మ క్రిములను సైతం నాశనం చేస్తాయి.. జలుబుతో ఇబ్బంది పడుతున్న వారు కర్పూరాన్ని ఏదైనా చిన్న క్లాతులో పెట్టి వాసన చూడటం వల్ల మూసుకుపోయిన ముక్కు ద్వారాలు కూడా ఉపశమనం అందుకుంటాయి. కర్పూరం వాసన అప్పుడప్పుడు చూస్తూ ఉంటే మన శరీరంలో ఏదో తెలియని శక్తి కూడా పెరుగుతుందట. నిద్రలేని సమస్యతో ఇబ్బంది పడే వారు కూడా వీటినుంచి బయటపడవచ్చు.

ముఖ్యంగా కర్పూరాన్ని ఎట్టి పరిస్థితుల్లో నేరుగా నోటిలోకి మాత్రం అసలు వేసుకోకూడదు. ఇది చాలా ప్రమాదకరమైనటువంటిదట. ఇంట్లోకి దోమలు రాకుండా కర్పూరం కూడా ఉపయోగపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: