చాలా మందికి కూడా శ్వాస తీసుకోవడంలో తరచూ బాగా ఇబ్బంది తలెత్తుతుంది. వీరిలో ఊపిరితిత్తులు చాలా బలహీనంగా ఉంటాయి. వాయు కాలుష్యం స్థాయిలు పెరుగుతున్న కొద్దీ ఊపిరితిత్తుల అనారోగ్యం కూడా ఖచ్చితంగా పెరుగుతుంది. చాలా మందికి ఆస్తమా, ఊపిరి తీత్తుల కాన్సర్ వస్తుంది. ఇప్పుడు చెప్పే చిట్కాలు పాటిస్తే ఖచ్చితంగా మన లంగ్స్ ని కాపాడుకోవచ్చు. ఆ టిప్స్ గురించి ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం.బరువు తగ్గడానికి గ్రీన్ టీని క్రమం తప్పకుండా తాగాలి. ఆరోగ్యకరమైన ఊపిరితిత్తుల నుంచి బరువు తగ్గడం వరకు గ్రీన్ టీలో అనేక సమస్యలకు పరిష్కారం చూపుతుంది.ఆస్తమా సమస్య ఉంటే వెల్లుల్లి తప్పక తినాలి. ఎందుకంటే ఇందులో ఉండే అల్లిసిన్ అనే నిర్దిష్ట పదార్ధం యాంటీబయాటిక్ గా పనిచేస్తుంది. వెల్లుల్లి ఊపిరితిత్తుల క్యాన్సర్‌ నుంచి ఉపశమనం కలిగిస్తుంది. శ్వాసకోశ సమస్యలను తగ్గించేందుకు పసుపు సహజ ఔషధంగా పనిచేస్తుంది. ప్రతి రోజు శరీరంలో కొంత మొత్తంలో పసుపు తీసుకుంటే ఊపిరితిత్తులు శుభ్రంగా ఉంటాయి.


పసుపు రోగనిరోధక శక్తిని పెంచడానికి కూడా సహాయపడుతుంది.దగ్గు, జలుబుని తగ్గించేందుకు అల్లాన్ని ఎక్కువగా వంటల్లో వినియోగిస్తుంటాం. అల్లంలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కూడా అధికంగా ఉంటాయి. ఇది శ్వాసకోశం నుంచి విషపదార్థాలను బయటకు పంపిస్తుంది. అల్లంలో మెగ్నీషియం, పొటాషియం, బీటా కెరోటిన్, జింక్ వంటి విటమిన్స్, ఖనిజాలు వంటి ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని కాపాడటంలో సహాయపడతాయి.మీరు ధూమపానానికి బానిసయ్యి ముందుగా దాన్ని మానేయడానికి ప్రయత్నించాలి. లేదంటే ఊపిరితిత్తులు మరింత పాడైపోతాయి. జీవనశైలిలో మార్పులతోపాటు ఆహారంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. రోజు వారి మెనూలో కొన్ని ప్రత్యేక వంటకాలను చేర్చుకోవడం ద్వారా ఊపిరితిత్తుల ఆరోగ్యం మెరుగుపడటంతోపాటు రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా పైన తెలిపిన టిప్స్ పాటించండి. మీ ఊపిరి తిత్తులను ఎల్లప్పుడూ కూడా సంపూర్ణ ఆరోగ్యంగా ఉంచుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి: