మన ఆరోగ్యంపై అధిక ప్రభావం చూపించే అలవాట్లలో ఉదయం లేవగానే చేసే పనులు చాలా కీలకం. చాలామంది గమనించకుండా కొన్ని చెడు అలవాట్లు పాటిస్తూ ఆరోగ్యాన్ని దెబ్బతీసుకుంటున్నారు. అలారం మోగిన తర్వాత మళ్లీ మళ్లీ స్నూస్ చేస్తూ పడుకోడం వల్ల నిద్ర చక్రం అసంతులితమవుతుంది. ఇది శరీరానికి గందరగోళాన్ని కలిగించి, అలసట, తలనొప్పి, జడత కలిగిస్తుంది. ఒకే సమయంలో లేవే అలవాటు చేసుకోండి. స్నూస్‌ను పూర్తిగా తప్పించండి. సోషల్ మీడియా, మెసేజ్‌లను ఉదయం లేవగానే చూడటం వల్ల మానసిక ఒత్తిడి, నెగటివ్ భావాలు పెరుగుతాయి.

ఇది ఆ రోజు మొత్తం ఉత్సాహాన్ని తగ్గిస్తుంది. ఉదయం కనీసం 30 నిమిషాలు మొబైల్‌కు దూరంగా ఉండండి. మొదట మీ శరీరాన్ని, మనసును శాంతంగా ఉంచండి. లేవగానే ఖాళీ కడుపుతో కాఫీ తాగితే గ్యాస్ట్రిక్ సమస్యలు, ఆమ్లత సిడిటీ ఎక్కువ అవుతుంది. శరీరంలో కార్టిసాల్ అనే హార్మోన్‌ను అణిచేస్తుంది. ముందుగా గోరువెచ్చిన నీరు లేదా లెమన్ వాటర్ తాగండి. తర్వాతే కాఫీ లేదా టీ తీసుకోండి. లేవగానే ఇంకా మంచం మీదే ఉండటం వల్ల జడత పెరుగుతుంది. శరీరం గా మారుతుంది. సర్క్యులేషన్ కూడా బాగా జరగదు. లేవగానే వెంటనే కదలండి. చేతులు, ముఖం కడగండి. 1–2 నిమిషాలు స్ట్రెచింగ్ చేయండి. రాత్రంతా నీరు తాగకపోవడం వల్ల శరీరం డీహైడ్రేషన్‌కి గురవుతుంది.

ఉదయం లేవగానే నీరు తాగకపోతే జీర్ణ సమస్యలు, శరీరంలో టాక్సిన్లు తొలగిపోవడం ఆలస్యం అవుతుంది. లేవగానే గోరువెచ్చిన నీర తాగండి. ఇది మలవిసర్జనను కూడా మెరుగుపరుస్తుంది. ఉదయం లేవగానే డబ్బు, పనులు, ఒత్తిడి గురించే ఆలోచించడం వల్ల ఉదయం నుండి లెవెల్స్ పెరిగిపోతాయి. లేవగానే 2 నిమిషాలు ప్రశాంతంగా కూర్చొని గాఢంగా శ్వాస తీసుకోండి. ధ్యానం లేదా ధన్యవాద భావనను అలవాటు చేసుకోండి. కొందరు బ్రేక్‌ఫాస్ట్‌కి ముఖ్యత ఇవ్వకుండానే లేవగానే వేడి కాఫీ లేదా టీ తాగి పనుల్లో పడిపోతుంటారు. ఇది బలహీనత, కలిగిస్తుంది. సకాలంలో మంచి ఫైబర్, ప్రోటీన్ గల బ్రేక్‌ఫాస్ట్ తినాలి – ఉదాహరణకు జొన్న రొట్టె, అట్టు, పప్పు, అరటి, బొప్పాయిలాంటి పండ్లు.

మరింత సమాచారం తెలుసుకోండి: