
చాలామంది దేవుళ్ల పూజలో తులసిని ఉపయోగిస్తారు. కానీ శివుడికి తులసిని అస్సలు వాడకూడదు. శివ పూజలో తులసిని సమర్పించకూడదు. శివుడు వైరాగ్యానికి ప్రతీక. అందుకే ఆయన పూజలో పసుపు, కుంకుమ, సింధూరం వంటివి వాడటం మంచిది కాదు. వీటికి బదులుగా విభూతిని ఉపయోగించడం శ్రేయస్కరం.
నం ఇతర దేవుళ్లకు శంఖంతో నీళ్లు సమర్పిస్తాం. కానీ శివుడికి శంఖంతో అభిషేకం చేయకూడదు. ఒక కథనం ప్రకారం, శంఖం 'శంఖచూడుడు' అనే రాక్షసుడి ఎముకల నుండి పుట్టింది, ఆ రాక్షసుడిని శివుడు సంహరించాడు. అందుకే శివ పూజలో శంఖం నిషిద్ధం. శివుడికి నైవేద్యం సమర్పించేటప్పుడు పువ్వులు, పండ్లు, పాలు, గంగజలం, నెయ్యి, చక్కెర, తేనె వంటి వాటిని ఉపయోగించవచ్చు.
ఈ జాగ్రత్తలు తీసుకుంటూ శివుడిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే, ఆయన అనుగ్రహం తప్పక లభిస్తుంద భక్తులు విశ్వసిస్తారు. శివుడిని పూజించే సమయంలో భక్తిశ్రద్దలతో వ్యవహరించాలి. పరమశివుడిని భక్తితో పూజించడం వల్ల అనుకూల ఫలితాలను పొందే ఛాన్స్ అయితే ఉంటుంది. సోమవారం రోజున తలస్నానం చేసి శివుడిని భక్తిశ్రద్దలతో పూజించడం ద్వారా మేలు జరుగుతుందని చెప్పవచ్చు.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు