ఇక్కడ టీడీపీ నాలుగుసార్లు విజయం సాధించింది. 1985, 1989, 1994, 1999 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధులు గెలిచారు. కడప జిల్లాలో కమ్మ సామాజికవర్గం ప్రభావం ఎక్కువగా ఉన్న నియోజకవర్గం కూడా ఇదే. అందుకే టీడీపీ వరుస విజయాలు అందుకుంది. కానీ ఎప్పుడైతే వైఎస్సార్ హవా మొదలైందో అప్పటి నుంచి టీడీపీ విజయాలకు దూరమైపోయింది. 2004లో కాంగ్రెస్ అభ్యర్ధి గుంటి వేంకటేశ్వర ప్రసాద్ గెలవగా, 2009లో ఎస్సీ రిజర్వడ్‌గా మారడంతో, కోరుముట్ల శ్రీనివాసులు కాంగ్రెస్ తరుపున దిగి విజయం సాధించారు.
తర్వాత వైఎస్సార్ మరణం, జగన్ వైఎస్సార్‌సీపీ పెట్టడంతో అందులోకి వచ్చేశారు. కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో 2012లో ఉపఎన్నికలు రాగా, అప్పుడు వైఎస్సార్‌సీపీ తరుపున బరిలో దిగి భారీ మెజారిటీతో గెలిచారు. ఇక 2014లో కోరుముట్ల స్వల్ప మెజారిటీ తేడాతో గెలిచారు. 2019 ఎన్నికలోచ్చేసరికి దాదాపు 35 వేల మెజారిటీతో టీడీపీ అభ్యర్ధి పంతంగాని నరసింహ ప్రసాద్‌పై విజయం సాధించారు.
నాలుగోసారి ఎమ్మెల్యేగా గెలవడంతో కోరుముట్లకు మంత్రి పదవి కూడా వస్తుందని అనుకున్నారు. జగన్ కూడా పదవి ఇవ్వడానికి ఫిక్స్ అయ్యి, కేబినెట్ ఏర్పాటు రోజు అమరావతికి పిలిపించారు. కానీ చివరి నిమిషంలో కొన్ని సమీకరణాల వల్ల కోరుముట్లకు మంత్రి పదవి రాలేదు. ఇక ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో దూకుడుగా పనిచేస్తున్నారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. ఇక ప్రభుత్వ పథకాల అమలులో ఎలాంటి లోటు లేదు. కొత్తగా గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాల నిర్మాణాలు జరుగుతున్నాయి.
అటు నాడు-నేడు కార్యక్రమం ద్వారా పాఠశాలలు బాగుపడ్డాయి. అయితే నియోజకవర్గంలో సమస్యలు ఎక్కువగానే ఉన్నాయి. నియోజకవర్గంలో తాగునీటి సమస్య ఎక్కువగానే ఉంది. రాబోయే వేసవిని దృష్టిలో పెట్టుకుని తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరముంది. అటు నియోజకవర్గంలో కొన్ని రోడ్లని అభివృద్ధి చేయాల్సి ఉంది. పార్టీ పరంగా వైఎస్సార్‌సీపీ చాలా బలంగా ఉంది. ఇక్కడ టీడీపీ తరుపున దివంగత చిత్తూరు మాజీ ఎంపీ శివప్రసాద్ అల్లుడు నరసింహ ప్రసాద్ పనిచేస్తున్నారు. కడప జిల్లాలో మిగతా టీడీపీ నేతలు యాక్టివ్‌గా లేకపోయినా సరే, నరసింహ మాత్రం యాక్టివ్ గా ఉన్నారు.
రోజుకో గ్రామంలో పర్యటిస్తూ ప్రజలకు చేరువయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు. నరసింహ తన పాటల ద్వారా జగన్ ప్రభుత్వ వైఫల్యాలని ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నారు. అయితే నరసింహ కోడూరు వదిలేసి నెక్స్ట్ చిత్తూరు ఎంపీగా వెళ్లాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. నరసింహ కూడా వెళ్లిపోతే కోడూరులో టీడీపీకి దిక్కు ఉండదు. పైగా నెక్స్ట్ టర్మ్‌లో కోరుముట్ల శ్రీనివాసులుకు మంత్రి పదవి ఖాయమైపోయిందని ప్రచారం జరుగుతుంది. మొదటి విడతలోనే మంత్రి పదవి మిస్ కావడంతో, నెక్స్ట్ మాత్రం జగన్, శ్రీనివాసులుకు పదవి ఫిక్స్ చేసేశారని తెలుస్తోంది. ఇక మంత్రి పదవి కూడా వస్తే కోడూరులో ఆయనకు చెక్ పెట్టడం టీడీపీ వల్ల కాదు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి